పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/4

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శతావధాని శ్రీ చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారు:

“ఆంధ్రకవితరంగిణి చాలభాగము చదివితిని, స్థూలదృష్టులకు మీ పరిశ్రమము గోచరింపదేమోగాని తక్కిన యావదాంధ్రకవులే గాదు. పండితులే కాదు, పామరులేకాదు వీరలెల్లరును కన్నులనద్దుకొందురనియే నాయాశము. ప్రప్రథమున మార్గదర్శీ మహర్షిః అనుచొప్పున శ్రీ గురజాడవారీ యుద్యమమునకు పూనిరి. కొంతవఱకే కృతకృత్యులైరి. వారిని నేను ప్రత్యక్షముగా నెఱుఁగుదును. మా కంటె సర్వదా కొంత పెద్దలైనను సమకాలీనులమే పిమ్మట వీరేశలింగపంతుల వారారంభించి వాలావఱకు కృతకృత్యులైరి. తరువాత మీరు దీనికి నుపక్రమించిరి. ఇప్పటికి వారిద్దఱిని సూత్రకారులు గను, వృత్తికారులుగను భావించుచో మీకు భాష్యకార స్థానం లభించుననుకొంటిని ... భవతు, ఇప్పటికి భాష్యకారస్థానముమీదే, మీ యుద్ధేశము సర్వదాజయప్రదమగుఁగాక ! విద్యాశాఖాధికారులు మీ పరిశ్రమను గమనింతురుగాక—ఇంతేస్వస్తి.

శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు, ముద్రాసు.

" ... విూ కవితరంగిణి చాలవరకు చదివితిని. అందు విూరుతీసి కొనిన శ్రమ అపారము. దానిప్రయోజన మపరిమితిము. వెనుకటి విషయములనేగాక ఆయా కవులనుగూర్చి యిటీవలి విమర్శనల మూలముగాను శాసనాది పరిశోధనల మూలముగాను బయలువడిన యనేక విషయములనుగూడ పొందుపరచి యాకవుల చరిత్రను సమగ్రము గావించితిరి. ఏవిషయమునను తీవ్రవాదములకు లోనుగాక నిష్పాక్షిక మగు చారిత్రకదృష్టిని నెలకొల్పుటకు మీరుచేసిన ప్రత్నము మిగుల ప్రశంసనీయము, తక్కిన భాగములుకూడ త్వరలో పకటితములగునని యాశించుచున్నాఁడను ... "