పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/3

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ పింగళి లక్ష్మీకాంతంగారు

(ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రధానపండితులు)

"యీ గ్రంథము, మీరు చేసిన కూలంకుష పరిశ్రమకు ఫలము, కవి గురించి కవిచరిత్రకారులు అడుగుపెట్టలేని గహనములలో మీరు రాచబాటలు మలిచితిరి."


శ్రీ రాయప్రోలు సుబ్బారావుగారు

(ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రధానపండితులు)

" ... మీ కవితరంగిణి కల్హణుని రాజతరంగిణివలె సారస్వతములో ముఖతిలకంగా ప్రకాశింపకలదు... ...అధారవస్తువివేచనలో మీ సమగ్ర విజ్ఞానమును ప్రమాణీకరణదృష్టియు ద్యోతమగుచున్నది. "


ఆంధ్రపత్రిక : " ... శేషయ్యగారు నిష్పక్షపాత బుద్ధితో యదార్థ మెంతయో గ్రహించడానికి అత్యధికంగా శ్రమపడ్డారు. అనుమాన ప్రమాణంతో కూడుకొన్న చరిత్రకు యిదమిద్ధమన్న నిర్ణయాలు మొండిగా చేసి చరిత్రకు అపకారం చేయకుండా చారిత్రక వస్తువులనందించి సూచనమాత్రం తన ఊహనుచెప్పి పాఠకులకు నిర్ణయాలకు సదవకాశమిచ్చారు. వీరి ప్రయత్నం ప్రశంసనీయమే"

ఆంధ్రప్రభ : "ఆంధ్రులకు సమగ్రమైన కవులచరిత్ర గ్రంథము లేని లోటు దీనితో తీరినట్టయినది. తక్కిన సంపుటములను కూడ త్వరలో వెలువరించడానికి తగిన ప్రోత్సాహం యివ్వవలసిన భారం ఆంధ్రులపైనున్నది"


శ్రీ నేలటూరి వెంకటరమణయ్యగారు

(మదరాసు విశ్వవిద్యాలము రిటైర్డు పండితులు)

"... ...తమ గ్రంథమువలన పూర్వవిమర్శకుల రచనలను వెదకి చూడవలసిన యావశ్యకత లేకపోయినది ఆంధ్రకవితరంగిణి యందు తామవలంబించిన పద్ధతి యధునాతన చరిత్ర రచనాపద్ధతి వంటిది, మీయత్నము కడు ప్రశంసనీయము."