పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

 జరించు = అనంగా శ్రవణానందకర మగు భాష యేసుఁడీ" యని బులుసు వెంకటరమణయ్యగారు. సంస్కృతమునుగాదు-తెలుఁగును గాదు–నాభాషకర్ణాటక మని తనకవిత్వధోరణినా క్షేపించువారికి శ్రీనాధుడు నెక్కిరింపుగాఁ జెప్పిన సమాధానమని శ్రీవీరేశలింగము పంతులు గారు. కర్ణాటభాషాసాం ప్రదాయమును గలిగియుండుటచేతనుసంస్కృ తాంధ్రశబ్దముశ్రమము నంది యుండుటచేతను గర్నాటక భాష యనినాఁ డని శ్రీ వేదము వేంకట రాయ శాస్త్రీగారు-ఇట్లే యనేక విధములుగా బండితులు తలంచుచున్నాగు మొత్తముమినాఁద నీసందర్భమున శ్రీనాధుని యభిప్రాయమును సర్వసమ్మతముగఁ దెలియజెప్పట సుకరమైన కార్యము కాదు ఈ పద్యమును శ్రీనాధుడు చాటు వుగా: జెప్పెనని యోచించి సముచితార్ధమును గ్రహింపవలసియున్నది.

శ్రీనాథుని నైషధాంద్రీకరణమును జూచి ఆంధ్రప్రత్యయ ములు వినా తక్కి-నదంతయు సంస్కృత మేయనియు నీ డు-ము—వులు నీవు తీసికొని మానైషధమును మాకిమ్మని సంస్కృత పండితులు శ్రీనాధు నధి క్షేపించిరనియు నొక కథ కలదు. వారికి మాధానముగా శ్రీనాషుపౌఢినిపద్యమును జెప్పెనని తోఁచుచున్నది. ' శబ్ద ప్రౌఢిని బట్టి యిది సంస్కృత మే యుని యనునొక" నిన ననుకొనుడు మాట్ చాతురినీ బట్టిమాత్రమే (ఆంధ్ర పత్యయాదులను జేర్చుట) యాంధ్రమనియను కొనిన ననుకొనుఁడు. మిరా రేవును కొనినను కొఱత లేదు. నాకవిత్వము సంస్కృతాంధ్ర మిశ్రమమయిన కర్ణాటక భాషయని శ్రీనాథుఁ డనెనని తలంపవచ్చును. భీమపురాణముననే ఆంధ్ర భాషను వేఱుగను కర్ణాటభాషను వేఱును శ్రీనాధుడుదలంచియున్నామాటకూడానిజము--కాని యదిలిపితో సంబంధించినది. ఆంధ్రమని నను దెలుఁగ నినను అచ్చ తెలుఁగని కొందఱియభిప్రాయము. అచ్చ తెలుగు గాకుండ కేవలము సంస్కృతము గాకుండ సంస్కృత పదసమాసమిళితమై యాంధ్రప్రత్యయవిశిష్టమైన వాక్యజాలముచే నొప్పారుచున్న భాషను గర్ణాట భాషయనియాకాలమునఁ గొందఱు తలంచినట్లు కన్పట్టుచున్నది.