పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/18

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

5–3] భీమేశ్వరపురాణమునఁ గుకవినిరాకరణ మను పేరున నాల్గు పద్యములున్నవి. శ్రీనాథుడు కుకవినిరసన మని యేగ్రంథమునను బద్యములను వ్రాయ లేదు. భీమ పురాణమునకు ముందు రచించిన శృంగార నైషధ హరవిలాసములలో లేదు. తరువాత రచించిన కాశీఖండము నందును లేదు. భీమేశ్వర పురాణమున గూడ వ్రాయ లేదనియు, నాతడు రచించిన చాటుపద్యములను విలేఖకులో ము దాపకులో యిందు చేర్చి రనియు నాయుద్దేశము, ఈ నాల్గు పద్యములలోను మొదటిది దక్క తక్కిన మూఁడు పద్యములలో గుపండిత నింద యే కానికుకవినిరసనము లేదు శివరాత్రి మాహాత్మ్యకృత్యాదిని గుకవి నిరసనవు మూఁడు పద్యములయందున్నది. కాని యాకృత్యాది శీనాథునిది కాదు.

భీమేశ్వర పురాణమునందలి నాల్గు పద్యములలో గడపటి పద్యమిది.

తే.ప్రౌడి బరికింప సంస్కృత భాష యండు

పలుకు నుడి కార మున నాంధ్ర భాషయండు నెవ రేమన్న నండ్రు గా కేలకొఱఁత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష. </poem>

ఈపద్యమును విలేఖకులు భీమేశ్వరిపురాణమునఁ జేర్చిరను కొన్నను, నిందలితుది పాదముపై జర్చ యవసర మే యగుచున్నది. శ్రీనాథుఁ డేయుద్దేశముతో దనది కర్ణాట భాషయని చెప్పినాఁడను నది యే ప్రశ్న. దీవిపై బండితులలో భిన్నాభిప్రాయ మున్నది. ఇందను గూర్చి వాదములింకను జిరుగుచునే యున్నవి. క్రొత్తవి బయలు దేరుచున్నవి. ఆ వాదములన్నిటి నిట వివరముగఁ దెలుపఁజాలను. 'కర్'_నాట" అని పదచేృదము చేసి ప్రాగుదీచీ. ప్రాగ్దణాంధ్ర దేశపు భాషయనియు, కర్నాడు అనగా నల్లని ప్రదేశమనియు, ఆప్రదే శములోనుండు భాషలో నాకవిత్వమున్నదని శ్రీనాథుడనియెననియు శ్రీకుందూరి ఈశ్వరదత్తుగారు. “(కర్ణ +ఆట) కర్ణసమిపమునఁ