పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

5-2] శ్రీనాథుఁడు 5

బాటి దిబ్బలు మొదలగు ప్రాచీన చిహ్నములు గన్పించుచున్న వనియు, వ్రాయుచుఁ బాకనాఁటింటి వాఁడవు" అను వాక్యములోని "బాకనాఁటి" యనునది దేశము కాదనియు, నది గృహనామమై యుండు ననియు, గంజాము జిల్లా పర్లాకిమిడి పట్టణములో "పాకనాటి" వారు చతుర్ధకులజు లున్నారనియు నట్లే యాయింటి పేరుగల వారు బాహ్మణులలోగూడ నుండియుందుర నియుఁ గావున శ్రీనాథుని యింటి పేరు పాకనాటి వారై యుందురనియు శ్రీటేకుమళ్ల అచ్యుత రావుపంతులు గారు , వ్రాసి యున్నారు. "పాకనాఁటింటివాఁడవు" అను వాక్యమునకుఁ బాకనాఁటి నియోగి శాఖా బ్రాహ్మణుడవు అనియర్థము చేసికొనవలయునే గాని యాశబ్దము నింటి పేరుగా గ్రహింప రాదని పలువురు పండితు లభి ప్రాయపడియున్నారు. అదియే సమంజసము.

శ్రీప్రభాకర శాస్త్రులుగారు కాల్పట్టణశబ్దమును బ్రధానము గాఁ దీసికొని, యాశబ్దమున కించుమించుగా సరిపోవునట్లు చూచి కృష్ణామం డలమందలి కాళీపట్నము శీనాథునిజన్మస్థానమై యుండు నని యూహించినారు. పై జెప్పిన పాకనాఁటి బాధను నదల్చుకొనుటకై శ్రీనాథుని తాత యాపట్టణమం దుండవచ్చుననియు, శ్రీనాథునాథుఁడో, ఆతని తండ్రియో", తాతయో పాకనాఁటి కేఁగియుందురనియు సమాధాన మొసంగినారు. ఆతనితండ్రి తాతలు వెలనాఁటి వారైనప్పడు శ్రీనాథుఁడు కొంత కాలము పాకనాఁటియందున్నను బాకనాఁటివాఁడన ని చెప్పకొని యుండఁడు. కుమారధూర్జటి తండ్రి తాతలనుండి కాళహస్తి ప్రాంతనివాసులైట్లు కన్పట్టుచున్నను తాను పాకనాటివాడ ననియే చెప్పకొనియున్నాఁడు శ్రీనాథుని పూర్వులు పాకనాఁటి వారై తరువాత శ్రీనాథుని తాత కాళీపట్టణమునకు వచ్చియుండెననినఁ గొంత వఱకు సమంజసముగ నుండునేమో! ఈ వాదములను జూచి-హేళన కొఱకో యేమో-శీనాథుఁడు సింహళద్వీపవాసియనియు, నచ్చటఁ గాల్పట్టణమున్నదనియు శ్రీకొత్తపల్లి సూర్యారావుగారు పరిషత్పత్రి