పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4. ఆంధ కవితరంగిణి

మున నున్నది శీనాథునివంటి మహాకవి యట్టి సమాసమును జేయఁడు. కాల్పట్టణమని పేరైన నై యుండవలయును లేదేని గ్రామ నామమును సంస్కృతీకరించి సమాసము నై నచేసి యుండ వలయును.

బ్ర. శ్రీ. వేటూరి ప్రభాకరశాస్త్రులుగారు కృష్ణా మండల మందలి "కాళీపట్టణము” శ్రీనాథుని జన్మస్థానమై యుండునని వ్రాసి యున్నారు,

శ్రీనాథకవి రచించిన భీమేశ్వరపురాణ కృతిపతియగు బెండపూడి యన్నయామాత్యుఁడు నుడివినట్టు చెప్పఁబడిన యూ క్రింది పద్యములో నీకవి పాకనాఁటివాఁ డైనట్టున్నది.

సీ. వినిపించినాఁడవు వేనుభూపాలున
కఖిల పురాణ విద్యాగమములు
కల్పించినాఁడవు గాఢపాకం బైన
హర్షనైషధ కావ్య మాంధ్రభాష
భాషించినాఁడవు బహు దేశ బుధులతో
విద్యా పరీక్షణ వేళలందు
వెద చల్లినాఁడవు విశదకీర్తి స్ఫూర్తి
కర్పూరములు దిశాంగణములందుఁ

తే. బాక నాఁటింటివాఁడవు బాంధవుఁడవు
కమలనాభుని మనుమఁడ వమలమతివి
నాకుఁ గృప సేయు మెుక పబంధంబు నీవు
కలితగుణగణ్య ! శ్రీనాథకవివరేణ్య

శ్రీకొముఱ్ఱాజు లక్ష్మణరావు పంతులుగారు శ్రీనాథుని జన్మ స్థానము, కలపటమను గ్రామమై యుండునని యూహించినారు. ఇదియే సత్యము గావచ్చుననియు, నీకలపట మిప్పడు, సముద్రతీరమున లేక పోయినను పూర్వమది సముద్రతీరమై యుండుననియు, గలపటమునఁ