Jump to content

పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ నా థు డు 3


జ స్మ స్థా న ము ----

ఈకవికిఁ బితామహుఁడైన కమలనాభామాత్యుడు, కవి పితామ హుఁడనియు, సాహిత్య చ క్ర వ ర్తియనియు, పద్మపురాణ సంగ్రహ మను కావ్యమును రచియించెననియు, శీనాథకవి రచించిన యీ క్రింది పదిముల వలనఁ దెలియుచున్నది.

<poem>తే.మాత్పి తామహుఁ గ విపితా  మహునిఁ దలఁతుఁ

గలిత కావ్యకలా లాభుఁ గ వులనా భుఁ జంద్ర చందనమందార సదృశ కీర్తి సరససాహిత్య సామాజ్యచక వర్తి. కాశీఖండము.

ము. కనక క్మాధధీగు వారిధిత టీకాల్పట్టణాధీశ్వరున్ ఘనునిన్ బగ్మపురాణసంగహ కళా కావ్యప్సబంధాధిపున్ వి నమ తా-కవిసార్వభౌముఁ గవితావిద్యాధరుం గొల్తు మా యనుగుందాత బ్రదాత శ్రీకమలనాభా మాత్యచూడామణిన్. <poem> భీమేశ్వరపురాణము.

ఈ కమల నాభామాత్వుఁడు రచించిన పద్మపురాణ మిప్ప డెచ్చ టను గాన రాదు. ఇతఁడు సముద్రతీరమందున్న కాల్పట్టణమున కధీ శ్వరుడైనట్లు పైపద్యములో నున్నది. కొన్ని ప్రతులలో క్రాల్పట్టణ మని యున్నది. కాని యీ పట్టణ మేదియో తెలియ లేదు. బ్ర. శీ). వీరేశలింగము పంతులుగారు క్రాలు" శబ్దమునకు “ప్రకాశించు" అను సరమును గహించి కొ త్తగా కట్టిన పట్టణము ప్రకాశించుచుండును. కావున నెల్లూరు మండలమందు సముద్రతీరము నున్న క్రొత్తపట్టణ మే యీ పట్టణమని యూహింపవచ్చునని కవులచరిత్రమున వాసి యున్నారు. కాని య్ యూహ సమంజసముగాఁ గన్పట్టుట లేదు. శ్రీనాథమహాకవి కొ త్తశబ్దమును సూచించుటకు కాలు “క్రాలు” అనుశబ్దముల నుపయోగింపఁడు. ఈశబ్దము సంస్కృతపదసమాసమధ్య