పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2 ఆంధ్ర కవి త రం గి ణి

<poem> సీ. కవిసార్వభౌముఁడై కర్ణాటవిభుచేతఁ గనకరత్నాభిషేకములు గనిన శ్రీనాథుసుకవి కూరిమి చేయుమఱదివి దుగ్గయకవి రాజ దగ్గుపల్లి .


ఈ పద్యములనుబట్టి శ్రీనాథకవి తన - వ్యాకరణ సాంఖ్యాదిశాస్త్రములయందు నిరుపమాన పాండిత్యము గల వాఁడనియు, సంస్కృత ప్రాకృతాది భాషా ప్రపూర్ఖుఁడనియు నెఱుంగ నగుచున్నది. హరవిలాసమున “నధ్వర్యు వేదశాఖాధీతినిష్ణాతు” అని చెప్పుకొనియుండుటచే నీమహాకవి కృష్ణయజుర్వేదమును సాంతము గాఁ బఠించిన వేద విదుఁడని తెలియుచున్నది. అధ్వర్యు వేద శాఖ యనఁగా కృష్ణ యజుర్వేదము.

-: ఈతడు రచించిన గ్రంథములు :-

ఈ కవిశేఖరు ఢాంధ్రమున రచించిన గ్రంథముల నీక్రిందఁ బేర్కొనుచున్నాఁడను. ౧ మరుత్త రాట్చరిత్ర ౨ శాలివాహన సప్తశతి ౩ శృంగార నైషధము ౪ భీమేశ్వర పురాణము ౫ కాశీఖండము ౬ హర విలాసము ౭ పల్నాటివీర చరిత్రము ౮ వీధినాటకము ౯ శివరాత్రిమాహాత్మ్యము ౧౦ పండితారాధ్య చరిత్రము ౧౧ నందనందన చరిత్రము ౧౨ మానసోల్లాసము ౧౩ ధనంజయ విజయము

ఇతఁడు సరస్వతీ దేవ్యుపాసకుఁడు. శివభక్తుఁడు, కాని వైష్ణవ మతమును ద్వేషించు వీరశైవుఁడు కాడు. అద్వైతి. ఈతడు రచించిన గంథములలోఁ జాల భాగము శివపరమయినవి. ఇతర గ్రంథములలోఁ గూడ విష్ణుకథలు వ్రాయవలసి వచ్చినప్పడు వ్రాయక విడిచి పెట్టియు, క్లుప్తీకరించియు, శివకథలను బెంచియు వ్రాసియున్నాడు.