పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - ఐదవ సంపుటము.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డదిశ్రీరామచంద్ర

ఆంధ్రకవితరంగిణి

63. శ్రీనాథుఁడు

కవిశార్వభౌమబిరుదాంకితుడగు నిమ్మహాకవి నియోగి బ్రాహ్మణుఁడు; ఆపస్తంబసూత్రుఁడు; భారద్వాజ గోత్రుఁడు; కమలనాభ పౌత్రుఁడు; సూరయమాత్యపుత్రుఁడు ఇతనితల్లి భీమాంబ.

ఈతని పాండిత్యము.

ఇతఁడాంధ్ర భాషయందు బహు కావ్యములను రచించిన ముహామేధావి. తర్కవ్యాకరణ శాస్త్రములయందు గొప్ప పండితుఁడు. ఆంధ్రకవిత్వమునఁ దిక్కనసోమయాజికిఁ దరువాతఁ బేర్కొనఁదగిన ప్రతిభాశాలి. ఈతని శిష్యుఁడును భార్యకు సోదరుఁడు నైన దగ్గుబల్లి దుగ్గనకవి తననాసికేతోపాఖ్యానమున శీనాథునిఁగూర్చి యిట్లు చెప్పి యున్నాఁడు .

సీ. సంస్కృత ప్రాకృత సౌర సేనీముఖ్య
భాషాపరిజ్ఞాన పాటవంబు
పన్నగపతి సార్వభౌమ భాషిత మహా
భాష్యవిద్యా సమభ్యాసబలము
నక్షపాదకణాద పక్షిలో దీరత
న్యాయకళా కౌశలాతిశయము
శ్రుతిపురాణాగమ స్మృతిసాంఖ్యసిద్ధాంత
కబళనవ్యుత్పత్తి గౌరవంబు

పూర్వక విముఖ్యవిరచితా పూర్వకావ్య
భావరససుధాచర్వణ ప్రౌఢతయును
గందళింపంగఁ గాశికాఖండనైష
ధప్రముఖవివిధ ప్రబంధము లొనర్చి.