పుట:శ్రీసూర్య శతకము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మహా గంభీరమైన మయూరకవి భావములను తెలుగువారికి తేటతెల్లము గావించిన యశస్సు, మయూర శతకానువాదకులలో నొక్క శ్రీరాములు గారికే దక్కినది. వా రెట్లు మూలశ్లోకములను తెలుగు చేసినారో చూపుటకు ప్రథమ శ్లోకానువాదములను నిచ్చుచున్నాను.

  
"జంభారతీభకుంభోద్భవ దధతం సాంద్రసిందూరరేణుం
రక్తస్సిక్తా ఇవమైరుదయ గిరితటే ధాతుధారాద్రవస్య
ఆయాంత్యాతుల్య కాలం కమలవనరుచే వారుణావిభూత్యై
ర్భూయాసుర్భానయంతో భువన మభినవాభానవో భానవీయాః

వసురాయడు:
శ్రీజంభారికరీంద్ర కు౦భయుగళీ సిందూర శుంభద్రజో
రాజవ్యాప్తినొ, ప్రాగహార్యతట నిర్యద్ధాతు ధారాద్రవ
స్రాజస్రార్ద్రతనో, సరోద్గమ సరోజాభాప్తినో పొల్చు తత్
భ్రాజన్నవ్యజగద్విభాసి ఘృణు వైశ్యర్యంబు మీ కిచ్చుతన్.

తూర్పుదిక్కున కధిపతియగు ఇంద్రునియైరావతము కుంభముల నుంచిన సిందూర రేణువులవలెను, ఉదయగిరి నుండి స్రవించుచున్న జేగురు ధారల వలెను, కమలవనము నుండి ప్రకాశమానమగు శోణకాంతివలెను నొప్పు నెఱునైన సూర్యకిరణములు మీకు శ్రేయస్సుల నిచ్చుగాక - అని తాత్పర్యము.

పై వసురాయనిపద్యమంతయు సంస్కృతభాషామయము- మూలమువలె మనకు తెలుగులో నున్నను నర్థము కాదు-అర్థము కాకపోవుట సరికదా, మూలముకన్న కొన్ని యధికముగా, నర్థస్ఫోరకముగాని పదములు యతిప్రాస నిర్బంధమువలన ప్రయుక్తము లైనవి.

వ్యాసమూర్తి శాస్త్రి గారు:
చ. తొలుదెస హ త్తికుంభములఁ దోరపుఁ జెందిరపుం న్రజంబునన్
ఐలె నుదయాద్రి సానువుల భాసిలు జేగురు టేటివెల్లువన్
బలె నపు చొప్పు నంబుజనిభంబలె నెఱ్ఱని డాలు మీఱు వే
వెలుఁగు వెలుంగు మీకు శుభవృద్ధి నిరామయసిద్ధిఁ జేయుతన్.