పుట:శ్రీసూర్య శతకము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. కైలాసమున శివుడు అర్ధనారీశ్వరుడై సుఖముగా నుండును. పాల సముద్రమున శేషశయ్యపై విష్ణువు హాయిగా నుండును. కాని ఎవడు. ఒక్క క్షణమైనను విశ్రమింపక, లోకరక్షణ కొఱకు ఉదయము మొదలు సాయం కాలము వఱకు తిరుగుచుండునో, అట్టి సూర్యుడు మీదొసగుల, తొలగించు గాక.[88]


ఉ. బింబము ఋక్కులై, లసదభీశులు సామములై యణుస్థితిన్
బింబము నొందువాఁడు మహనీయయజుశ్రుతియై త్రయీమయా
డంబరమూర్తి యంచు నెదుటంబడి వైదికులెల్ల మ్రొక్క స్వ
ర్గం బపవర్గ మిచ్చు గ్రహరా జొసగున్ సిరి మీకు నిత్యమున్.

తా. సూర్యబింబము ఋగ్వేదము - కాంతి సామవేదము, సూర్యమండలాంతస్థుడైన పురుషుడు యజుర్వేదము. ఇట్లు త్రయీమూర్తియై స్వర్గాపవర్గములను ప్రాణికోటిని కటాక్షించు సూర్యుడు మిమ్ములను రక్షించుగాత.[89]

శా. అయ్యల్ లోకహితప్రచారులు సురేంద్రాదుల్ సుతుల్ దైత్యులున్
వ్రయ్యల్ నేసిన జోదు లయ్యదితి కెవ్వారున్న మౌనివ్రజం
బయ్యాదిత్యపదంబు వీని కగుఁగా కంచు న్నుతుల్ సేయు న
క్షయ్యప్రాభపుఁ డైన సూర్యుఁడు సమస్తశ్రీలు మీకిచ్చుతన్.

తా. అదితి సంతానమగు దేవతలందఱు నెవని సేవించి సూర్యుడాదిత్యుడను శబ్దమను సార్థకము చేయుదురో సమస్త మునిగణము నెవని సంతతము స్తుతించుచుండునో, అట్టి సూర్యుడు మీకు శుభ ప్రారంభముల్గూర్చుగాక.[90]

చ. వెలుఁగున మంటిమేలిమియు వృష్టిజలాకృతి సంస్కృతి న్మహా
నిల తనువుష్టిమన్ జగతి నిప్పుమెయిన్ మదిఁ గోర్కెలిచ్చి యు
జ్జ్వలలితమూర్తి యున్కి మినుచాయయు దర్శనుఁ జంద్రురూపు ని
ట్లలరి స్వమూర్తితో నెనిమిదౌ శివలీలల ప్రొద్దు మీ కగున్.