Jump to content

పుట:శ్రీసూర్య శతకము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలె జగము పడియుండునో, నలుదిక్కులను కటిక చీకటి గమ్మినట్లుండునో అట్టి సూర్యుడు మీ కవారైశ్వర్యముల నిచ్చుగాత. సూర్యుడుదయింపనిచో లోకవికాసమే లేదని భావము.[85]


చ. నిలుకడలేదు లోకగతి నిల్చునుఁ దత్పరిపాలనంబునన్
వెలుఁగున లోకదృష్టి మిఱుమిట్లగు లోపలిదృష్టి మే లగున్
బలితపు లోకతాపమగు మౌనుల నిర్వృతి కారణం బగున్
లలి నిటుఁ బ్రాగ్దిశాధికవిలాసుఁడు భానుఁడు మీకు మేలిడున్.

తా. ప్రపంచమున కంతకు కాంతిని ప్రసాదించుటకు నాతడు తిరుగుచునే యుండును - కాని స్థిరముగా నుండును. జనులు చూచుటకు దుర్నిరీష్యుడుగా నుండును కాని, భద్రములను గలిగించును. అతడు మనుజులను తపింప జేయును, అయినను ముక్తి నిచ్చును. అట్టి సూర్యుడు మీకు సంపద లొసంగు [86]

ఉ. కాలము దప్పవాఱయిన కాఱులు పండు సువృష్టిఁ జేలు దే
వాళి మఘంబులం దనియు నప్పవమానుఁడు వీఁచుఁ జుక్కలున్
దూలవు, మోచు నద్రు లిలఁ గోయధిమేరను మీఱ దాశలున్
మేలగు నిట్లు ముజ్జగము నిల్పు దివాకరుఁ డేలు మిమ్ములన్.

తా. ఋతువులు తప్పక క్రమముగా వర్తిల్లును - వానలు సకాలమున వర్షించును - దిక్కులు చెక్కు చెదరక నిలచును - కులపర్వతములు కదలక యుండును - ఇట్లు ముల్లోకములను స్థిరముగా నిలిపిన తీవ్రాంకుడు మీకు తేజస్సు నొసగు గాత.[87]

ఉ. చక్కనిచుక్కఁ బ్రక్క నిడి శంభుఁడు గ్రుమ్మంబు వెండి కొండపై
నక్కడలి న్మురారి యహియందు సుఖంబుగ నిద్రబోవు దా
నక్కమలాసనుండు దినమంతయుఁ జీత్తనిరోధ మూనుఁ బెం
పెక్క నితండు ముజ్జగమునేలఁగ నీ రవి మిమ్ముఁ బ్రోచుతన్.