పుట:శ్రీసూర్య శతకము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రంగు లెసంగుగాని చెదరంగఁ గరంగవు సత్కృపాప్తి ని
బ్బంగిని మార్దవంబు గలభాగ్య మహమ్ము వినుండు మీకగున్.

తా. చాల వేడి గలవియయ్యు సూర్యకిరణము లాకాశగంగ నీటిని నింకజేయవు సరికదా, అందలి కమలములను వికసింప జేయును, అట్లే చెక్కు చెదరకుండ నందనోద్యాసమును ప్రకాశింప జేయును - మేరుగిరి బంగారు శృంగములు నెవ్వని తెల్లనైన కాంతిచేత తెల్లబడవో అట్టి సూర్యుడు మీ కాయుర్భాగ్యము ప్రసాదించుగాక.[83]

ఉ. చీకటి నొక్కదానిన గ్రసింపదు కల్మష కిల్బిషంబులన్
నూకునుఁ దమ్మిమాత్రమ వినోది నొనర్పదు భక్తబోధన
శ్రీకము కేవల మ్మహిమ చేయదు శ్రేయముగూర్చు మద్యమం
బేకము పూనియుం బనులనేకము నేయు నినుండు మీ కగున్.

తా. ఎవ్వడు కేవలము చీకటిని నశింప జేయుటయే గాక పాపములను పోగొట్టుచున్నాడో, ఎవడు కిరణముల తాకుడు వలన, తామరులను కాంతిమంతము చేయుటయే గాక తనయడుగు దామరల మ్రొక్కు వారిని తేజోవంతులుగా జేయుచున్నాడో, ఎవడు, పగటికి కర్తయగుటయే గాక, మోక్షమునకు కర్త యగుచున్నాడో, ఆ భానుడు, మీకు, నిరంతర శుభములు చేకూర్చుగాక.[84]

చ. పరవశవృత్తి చెయ్వుడిగి ప్రక్కలఁ బండి నివాళ నూర్చి యే
దరిఁ గనఁ జీఁకటై నెగులు దాల్చినయట్లు జగంబుఁ జేయుచున్
మఱియొక లోక మభ్యుదయమాన్యము సేయఁగఁబోవునట్టి భా
స్కరుఁడు శుభక్రియాకలన సంతసము న్మిముఁ బ్రోచుఁ గావుతన్.

తా. ఏ సూర్యుడు లేకపోయిన యెడల - ఉదయింపని యెడల లోకము చైతన్య రహితమై మట్టిపెల్ల వలె బడియుండునో మండము పట్టి చేష్టలు దక్కి, బ్రదుకుదునో, బ్రదుకనో యను సందేహము గల మానవుని