పుట:శ్రీసూర్య శతకము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ధ్వంస క్రియ చేసినను నూతన సృష్టి చేయును. అట్టి సూర్యమండలము మీకు శోభాయమాన మగుగాక [80]

రవి వర్ణనము

చ. శ్రితవిధులై బుధుల్ క్రుతుల సిద్దులు గీతిని సౌరగాతలున్
జతురతఁ జాటు గర్భముగఁ జారణులు న్యతబుద్ధియాతుధా
నతతి ముహుర్ముహుర్నతిఘనాహులు సార్ఘ్యము సాధ్యులున్ మహా
వ్రతనియతిన్ ముముక్షువులు పక్షతఁ గొల్చు నవాద్రి మీకగున్.

తా. సిద్ధులు సిద్ధాంతవాక్యముల చేతను, విబుధులు వేదవాక్యముల చేతను, చారణులు చాటువుల చేతను, గంధర్వులు గీతముల చేతను, బ్రాహ్మణులు ప్రాతఃకాలమున అర్ఘ్యములతోడను, రాక్షసులు మనోనిగ్రహముతోడను నెవని స్తుతింతురో అట్టి సూర్యుడు మీ యఘముల నడగార్చు గాక.[81]

ఉ. చెంగట నంగుగా వెలుఁగు చిచ్చులకొల్మినిఁ గాచి కాచి వె
ట్టం గతిమ త్తురంగ ఖురటంకముల న్వడిఁ గోసి కోసి ని
స్సంగ రథాంగసంభ్రమ లసన్నికషాప్తిని గీసి గీసి ము
బ్భంగుల మేరువుం దిరిగి వన్నియగట్టు నినుండు మీ కగున్.

తా. బంగారము పరీక్షించుటకు మూడు విధములు గలవు. 1.పుటము పెట్టుట 2) కొంచెము ఖండించి పరీక్షించుట 3) ఆకురాతి యొరపిడి.
ఎవని కిరణముల తీవ్రతచే. బంగారు పర్వతము (మేరు పర్వతము - సూర్యుడు దానిచుట్టు పర్యటించును.) పుటము పెట్టినట్లయినదై, రథాశ్వముల గొరిజల తాకుడుచే, పైకి పెట్లుచున్న ముక్కలు గలదై రథచక్రముల యొరపిడి - యను మూడు పరీక్షలకు లోనగుచున్నదో అట్టి రవి మీకు నభ్యుదయములు ప్రసాదించు గాత.[82]

ఉ. బంగరుతమ్మి గంగఁ బ్రతిభం గనువాడదు నందనంబునన్
దుంగు సుమాళిలక్ష్మి కడు దోడదు నెండదు మేరుశృంగముల్