పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

390

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


దేశమున కేగి యచ్చట ధీరుఁ డగుచుఁ
దపము చేయుటకై కుశస్థలిని నిలిచి.

289


సీ.

శ్రీకృష్ణరూపంబుఁ జిత్తమం దుంచి త
        పంబు సేయఁగను గోపాలవేష
ముల నేను బ్రత్యక్షముగ నిల్చి వర మేమి
        కావలెనని పల్కఁగా నతండు
పరమాత్మ కృష్ణరూపంబుతో మీ రుండ
        వలె నేను బూజింపవలయు నట్టి
సద్వరం బీయు మోస్వామి యంచు వచింప
        నతని కిట్లంటి శేషాద్రియందు


తే.

శ్రీనివాసుఁ డనంగఁ బ్రసిద్ధి నొంది
యుందు న న్నందుఁ బూజింపుచుండుఁ గృష్ణ
వేషమునఁ బూజగొన నిది వేళ గాదు
గాన నిఁక లేచి వేంకట[1]గ్రావమునకు.

290


చ.

జనుమని రంగదాసుఁ డనుసజ్జనుఁ డొక్కఁడు దారిలోపలన్
గసఁబడు వానిఁ దోడుకొని కాననభూముల దాఁటి వోవఁగాఁ
గనకమయాద్రి ముందటగఁ గన్పడు వేడుక మీఱ నందు నీ
వును నతఁ డేగ నే నెలమి నొందఁ బ్రసన్నుఁడ నయ్యెదం గృపన్.

291


తే.

శూద్రుఁడైనట్టి రంగదాసుండు పుష్ప
తులసికాదళములను సంతోష మెసఁగఁ
దెచ్చి నీచేతి కిచ్చు సందేహ మాత్మ
నుంచ కవి గొని పూజించుచుండు నన్ను.

292
  1. గ్రావము = కొండ