పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

369


పైడిపళ్లెర ముంచి భక్ష్యభోజ్యాదిప
        దార్థము ల్వడ్డించి రపుడు శౌరి
వనధిజ పద్మావతిని తా నుభయపా
        ర్శ్వముల నుంచుకొని ముచ్చటలు మీఱఁ


తే.

దనకుఁ జుట్టురు బంతులు దనరియున్న
బ్రహ్మరుద్రాదులుం గూడఁ బ్రమదమార
నారగించుచు నుండఁగ నంద మొదువఁ
దాను భుజియించె విభవంబు తనర నపుడు.

214


వ.

అంత నందఱు హస్తపాదప్రక్షాళనం బొనర్చుకుని దివ్యమం
దిరం బొక్కయెడ వీడెములను జేసి యించుక నిదురించిరి.

215


ఆ.

నిదురఁ జెంది సూర్యుఁ డుదయింపఁగా లేచి
వారివారిపనులు వఱలఁజేసి
రంత సిరికిఁ బద్మ కలరంగఁ జక్రికి
నల్గు లిడిరి దినదినంబు నెలమి.

216


సీ.

నలుగులు [1]నామెతనంబులు బువ్వముల్
        సంతర్పణంబులు సంతసముగ
నడుపుచు మూఁడవఁనాడు [2]పాకెన చేసి
        నయముగ నాల్గవనాఁటిరాత్రి
అందఱతో శౌరి హరిబువ్వము భుజించి
        శయనించి పిదప దా జామురాత్రి
కడ లేచి సరవి నప్పుడు శేషహోమము
        గావించి యగ్నికి భావమలర

  1. ఆమెత = విందు
  2. పాకెన = సదస్సునాఁటి మహదాశీర్వచనము