పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

శ్రీవేంకటాచలమాహాత్మ్యము


క.

మీ కనపాయినియై తగి
యాకమలాదేవి వక్షమందుండును మీ
సూకకరూపము చూపిన
నాకాంతకు వెఱపుఁ దోఁచదయ్య మహాత్మా.

56


తే.

మీరు సర్వజ్ఞమూర్తులు మీకుఁ దెలియ
కున్నదే నాకుఁ దోఁచ కీవిన్నపంబు
చేసినా నింక దేవరచిత్తమునకు
సమ్మతం బైన నది లోకసమ్మతంబ.

57


వ.

అని పక్షీంద్రుం డురుతరభక్తిం బ్రణామంబులుం జేసినం
జూచి హరి కరుణించి యిట్లనియె.

58


సీ.

అనఘ ఖగేంద్ర నే నచటికి రానిప్డు
        ధరణిపై వసియించి దానవులను
బరిమార్చి సుజనులఁ బాలింతు నిఁక నీవు.
        పొల్పగువైకుంఠపురము చేరి
వనధికన్యకకు నీవార్త లొప్పఁగఁ జెప్పి
        క్రీడాచలముగొని [1]గెలివి మెఱయ
రమ్ము పొమ్మన ఖగరాజచ్యుతునినాజ్ఞ
        గొని వేడ్క నరిగె వైకుంఠమునకు


తే.

నపుడు కిటి యగువిష్ణు వియ్యవనిఁ దిరిగి
తాను వసియింపఁ దగినట్టితావుఁ గనుచు
వచ్చుచును నిల్వకెందును వనజనేత్రుఁ
డొక్కయెడఁ జూచి యిదియ సర్వోత్తమంబు.

59


వ.

అని మనంబున నిర్ణయించె, నయ్యది గౌతమీనదికి దక్షిణం

  1. గెలివి=సంతోషము