పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

శ్రీరమా పరిణయము

“ఓ మామ! మీ పట్టి - నుచితంబుగాను
ప్రేమతో వారు చె - ప్పిన చందముననె
పరిపాలనముఁ జేతుఁ - బ్రఖ్యాతిమీఱు
నురమునం దిడుకొని - యుందు సంతతము,
స్వాంతంబులో నీవు - సంతసంబందు!
చింతింపవల'దని - చెప్పి, శ్రీసతిని
మన్నించి, కౌస్తుభ - మణితోడ నపుడు
పన్నుగా వక్షంబు - పైన నుంచుకొనె.
అంత సాగరునకు, - నతని భార్యలకు, 760
సంతోషమెసఁగ నా - [1]జలజాంతకునకు
బహు దివ్య భూషణాం - బరము లిప్పించి,
విహిత సత్కరుణతో - వీడ్కొల్పె, వారు
నిజనివాసముఁ జేరి - నిరతంబు హరిని
భజియింపుచుండి; రా - పద్మాక్షుఁ డిచట

శ్రీనివాసుని వైభవము


నెళవుగా నానంద - నిలయంబునందు
వలనొప్పఁగా శ్రీని - వాసాఖ్య నమరి,
అరుదుగా బ్రహ్మోత్స - వాదుల, మఱియు
నిరుపమానములైన - నిత్యోత్సవములఁ
[2]బరమ సంతోషసం - భరితుఁడై, చాలఁ 770
బరుస నాకర్షించి, - బహుభాగ్యములను

  1. జలజాంబకుండు - పూర్వ ముద్రిత పాఠము.
  2. పరముఁడు సంతోషభరితుఁడై చాలఁ - పూర్వముద్రిత పాఠము.