పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్విపద కావ్యము

37

సముద్రుని హితవచనములు


'అమ్మ! ర'మ్మని సిరి - నంకపీఠమున
నెమ్మదితో నుంచి - నెమ్మోము నిమిరి,
'ఓ యమ్మ! యిచట ని- న్నుంచి పొమ్మనుచు
మా యల్లుఁడైన యీ -మధుసూదనుండు
పలుకుచున్నాఁడు, నీ - పతి యాజ్ఞలోనె
నిలువు నీ విచ్చట - నే సమ్మతమునఁ,
గలకంఠి! నీ పతి - కనుసన్నలోనె 700
మెలఁగుచు, మాకు నె - మ్మినిఁ గీర్తి దెమ్ము!
వనజాక్షి! యిచ్చట - వకుళ మాలికను
మనము రంజిల్లఁగా - మన్నింపుచుండు!
[1]పతి సేవయందుఁ గో - పము చేసినపుడు
హితవులు చెప్పి, న - వ్వెలమి లాలించు!
పన్నుగా వచ్చిన - భక్త కోటులకు
నన్న పానము లిచ్చి - యపు డాదరించు
అలరి మున్పటిరీతి - నాట్లాడవలదు!
పొలుపొందఁ బెత్తనం - బు వహించియుండు!
పరఁగ నింతైన లో - భగుణంబు లేక 710
వరము లందఱికి న-వ్వారిగా నిమ్ము!

  1. పతి సేవ్యుఁ డెపుడు కోపము సేసినపుడు,
    హితవులు సెప్పి నవ్వెలమిఁ దోఁపించు
    పూర్వ ముద్రిత పాఠము