పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్విపద కావ్యము

35

సర్వేశ్వరుఁడ వీవు, - సర్వాత్మ వీవు,
సర్వసాక్షివి నీవు; - సద్బ్రహ్మ నీవు
కావున, నీ వెఱుం - గని నీతి గలదె?
భావింప శ్రీసతి - ప్రౌఢగా - దిపుడు,
ఈ పసిబిడ్డ నిం - దిరవుగా నుంచి, 660
యీ పట్లఁ బోను కా - ళ్ళెట్లాడు మాకు?
నిపుడె మమ్మెడఁబాసి - యీ చిన్నబాల
నిపుణత్వమున నిందు - నిలువ నెట్లోపు?
మా యింట నాటలే - మరగిన యబల
మీ యింటఁ బనులలో - మెలఁగ నెట్లోపు?
పొసఁగ [1]బ్రహ్మాండ రూ - పున నొప్పు మిమ్ము
విసువక సేవించు-విధము లేమెఱుఁగు?
చాలఁ దల్లులచెంత - జనవుగా నుండు
నీ లేమ భయ భక్తు - లెఱుఁగునే యిపుడు?
కావున దయచేసి - కమల నీ మాటు 670
మా వెంట నంపవే! - మహితాత్మ!' యనిన,
వనజోదరుఁడు నవ్వి - వకుళ మాలికకుఁ
గనుసన్న చేసి సా - గరు దిక్కుఁ జూపె.

  1. బ్రహ్మాండ రూపుని నొప్ప మిమ్ము - పూర్వ ముద్రితపాఠము