పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

శ్రీరమా పరిణయము

అనఘ! నీ చెల్లెలి - నధికురాలనుచుఁ
దనర నా చెల్లెలిఁ - దక్కువ యనుచుఁ
బలికితి విపు డెంతో - ప్రౌఢుఁడుగాను,
నెలవొప్ప వినుమైతె - నీ చెల్లి రీతి
నొనర నుండినచోట - నుండక తిరిగి
జనులను వంచించు - చపలాత్మురాలు
కావున మా శైల - కన్యకసాటి
యే విధమునఁ గల్గ, - దీ మాట లేల?
అప్పుడు నీవు నె - య్యంబుతో మాకుఁ 490
దెప్పింతునంటివి - తిరుపణా చాఱు
[1]తప్పవ ద్దా మాట, - తనివి దీరఁగను
తెప్పించు, మది యెంత - తెప్పింపఁగలవొ?
నా కడు పందునై - నను నిండకున్న
నీకుఁ [2]జంద్రున కదే - నిపుడు ద్రావింతుఁ,
జల్లని తిరుపణా - చాఱు ద్రావుటనె
తొల్లిటినుండి చం - దురునకు, నీకుఁ
దెల్లగా నుండెడి - దేహంబు గలిగె.
కల్లగా దీమాట - [3]గంజి మీ సొమ్మె:

  1. తప్పక మా కిట - పూర్వముద్రిత పాఠము.
  2. జంద్రుని కళ నిపుడు దాగింతు - పూర్వముద్రిత పాఠము.
  3. కన్య మీ సొమ్ము - పూర్వముద్రిత పాఠము.