పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

శ్రీరమా పరిణయము

పరఁగ నచ్చటఁ బైఁడి - పళ్లెరాలుంచి
గరిమతోఁ బాత్రాభి - ఘారంబుఁ జేసి,
బహువిధ భక్ష్యముల్, - పక్వ శాకములు,
విహిత దివ్యాన్నముల్, - వింత పచ్చళ్లు,
తఱుచైన ఘృతము, దు - గ్ధములు, తేనియలు,
పెరుఁ, గూరుగాయలు - ప్రియముగాఁ దెచ్చి,
వరుసగా వడ్డించి, - వాసించు జలము
కరమొప్ప [1]హాటక - కలశాల నిండ
నించి, యందుంచి; రా - నీరజోదరునిఁ 250
గాంచి నవ్వుచు నీల - కంఠుఁ డిట్లనియె:

శంకర, శ్రీహరుల వావి పల్కులు


'జలజాక్ష! నీవు మా - జలరాశి యింటఁ
గలుముల చెలి నిట్లు - గైకొన్న కతన
నసమాన సౌఖ్యంబు - లబ్బె నీ కిచటఁ
బొసఁగ నాఁకలి దీర - భుజియింపవోయి!
మీనరూపముఁ దాల్చి - మెండుగా జలము
పానంబుఁ జేసిన - ప్పటివలెఁ గాదు,
ఈ నిర్మలాన్నంబు - లిచ్చట నీవు
పూని యాఁకలి దీర - భుజియింపవోయి!
పరఁగఁ దాఁబేలివై - స్వల్పజంతువుల 260
నరుదుగా భక్షించి - నటువలెఁ గాదు,

  1. సౌవర్ణ కలశాళి నిండ - పూర్వ ముద్రిత పాఠము.