పుట:శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్విపద కావ్యము

11

భయభక్తు లెసఁగ నా - పంకజోదరునిఁ
బ్రియముమీఱ వివాహ - పీఠమందుంచి,
వలనొప్పఁ దక్కిన - వారి నందఱిని
నలువొప్ప విహితాస - నంబులం దుంచి,
విలసితమూర్తులై - వెలయు విశ్వేశ,
జలజాసనాదులు - సభికులుగాఁగ,
పరఁగ శ్రీ పార్వతీ - భారతీ ప్రముఖ 190
తరుణులు పెండ్లిము - త్తైదువుల్ గాఁగ,
వరుసగా నందు వి- వాహ కృత్యములు
పొరిఁబొరి నా కశ్య - పుఁడు నెఱవేర్ప,
మంగళస్నానాది - మహిత కృత్యములు
సాంగంబుగాఁ జేసి, - సకలోత్సవములు
నలువొప్పఁగాను పు - ణ్యాహవాచనము,
విలసిత స్నాతక, - వేద వ్రతములు
చేసి, కాశీయాత్ర - శ్రీహరి చనఁగ,
వాసిగాఁ దోయధి - వచ్చి ప్రార్థించి
కపటనాటక! నీవు - [1]కాశి పోనేల? 200
ఇపుడ నా సుతను నీ - కిచ్చెద' ననుచు
మగుడి తోడ్కొనిపోయి - మందిరమందు
జగదీశ్వరుని నిల్పె - సంప్రీతి నపుడు.

  1. కాశి కేఁగెదవె? - పూర్వముద్రిత పాఠము.