పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

60

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


నేను మెచ్చితి నీతపో నియతి కిపుడు
కోర్కు లేమైన నిచ్చెదఁ గోరుమనియె.95

అనిన నమ్మహీజాని దేవా! ముక్తి ముక్త్యుపాయంబులు దెలిసియు దేహాభిమానంబునఁ గామ క్రోధాద్యంతశ్శత్రుల జయింపం జాలమి మనన సమాధి వాసనాత్యాగ యోగంబులు లభింపక ముక్తుండఁగానైతి నిపుడు మోచక ప్రదుండగు కుంభసంభవు వలన మోచకుండవగు నిన్నెఱింగి భజించుట చేత భవత్ప్రసాదంబున దేహాభిమాన కామక్రోధాదులు వదలుటచేత నచల బ్రహ్మంబు నేనయై ముక్తుండనైతి నింక నాత్మదృష్టి నాకంటె నన్యంబేమియు లేకుంట నేనేమి కోరువాఁడ ? నింతకాలం బవిద్యా ప్రతిబింబ చైతన్యుండనై జీవుండనఁబడి కించిద్ జ్ఞత్వంబున ననేక జన్మంబుల సుఖదుఃఖంబు లనుభవించి మాయా ప్రతిబింబ చైతన్యుండవై యీశ్వరుండవై నీవు సర్వజ్ఞత్వంబున బ్రహ్మంబవగుట నిన్ను గురూపదేశంబున నెఱింగి భుజించుట నీవు నేనయై యచల బ్రహ్మస్వరూపుండనైతి నహో! గురూపదేశం బింతచేసె నధ్యాసశూన్యులైనవారికి గురునియందు మనుష్యబుద్ధి జనించుఁగాని గురుండు సాక్షాత్పరబ్రహ్మం బని యానందించు నన్న రేంద్రునకు శివుం డిట్లను. నీవు విదేహ కైవల్యంబు నొందుము. నీకళేబరంబు కపోతేశ్వర నామక లింగంబై యాకల్పంబు వసించుగాక యని యంతర్ధానంబుఁజెందే నంతట.96ఆతడుఁ బ్రారబ్ధ నాశనం బగుటవలన
బ్రహ్మమయ్యెను సంకల్పపటలి బా సి
తచ్ఛరీరంబు లింగమై ధరణినిలిచె
నది మహాద్భుతమని యెంచి యచటిమునులు.97

ఆ లింగమూర్తికి నభిషేక మొనరించి
         రోంకార మంత్రంబు నుచ్చరించి.