పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/87

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

58

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము

సమాధి వాసనా త్యాగయోగంబులు సంభవించని కతంబున బ్రహ్మపదారూఢి నొందనైతి నిదిగాక దేహాభిమానులై పరస్త్రీ రతులై పరహింసా పరులగుచు కామక్రోధాదిగ్రస్తులైన శుద్ధతామసులు గురూపదేశశాస్త్ర బోధంబుల నీజ్ఞానంబుగల్గియు రావణాద్యసురులంబోలి దండార్హులగుదురు గాని ముక్తినొంద రట్లగుట శుద్ధసాత్వికులయిన యధికారు లీ జ్ఞానంబుగల్గి యీశ్వరోపాసనంబు జేసినఁ గ్రమంబుగా మనన సమాధి వాసనా త్యాగ యోగంబులుగల్గి ముక్తిగాంతురని తలంచి తాను నీశ్వరోపాసనంబు చేయం దలంచియున్న సమయంబున.88


శిబికడ కగస్త్యుఁడు వచ్చుట


శుద్ధశైవుఁ డగస్త్యుఁ డా క్షోణినాథుఁ
పాలి కేతెంచి మోచకోపాసనంబు
నీకుఁ దెల్పంగవచ్చితి నేఁడు మోచ
క ప్రదుఁడనయి తద్విదికలన వినుము. 89

అని మునిముఖ్యుఁడు మోక్షము
దనరంగాఁ దెల్పి యంతఁ దదుపాసనమున్ .
మనమునఁ బనుపడఁ జేసిన
జననాథుఁడు వికచహృదయ జలజాతమునన్.90

ధ్యానంబుజేసె నీశ్వరు
మానితవట మూలదేశ మణిమండపమ
ధ్యానూన సింహపీఠిక
బూనిక గిరిజాసమేతముగ సద్భక్తి.91

సనకాది సన్ముని సంఘంబు లిరువంక
             నుతియింపఁ బ్రమధు లున్నతి భజింప