పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

57ధనము రాసులు మేరు మందరము లట్లు
గూర్చితివి బుత్రపౌత్రులఁ గూడి సుఖము
నొందితినిగాని తృప్తి దా నొందదయ్యె
నీషణత్రయమును గెల్వ నెవరితరము ?83

దానములు పెక్కు జగదేకదాతనౌచు
జేసితిని జన్నములు వేయుఁ జేసినాఁడ
నిన్ని చేసిన ముక్తి లే దెంచిచూడ
తుచ్ఛసంసార మోహంబు దొలఁగకుంట.84

రోగ దారిద్య్ర బంధు విరోధగేహ
కలహ దౌర్భాగ్య దుఃఖసంకలితులయ్యు
వికట సంసారమోహంబు విడువలేరు
వివిధ సుఖభోగవంతులు విడువగలరె ?85

ఇటువంటి సంస్కృతి భ్రమ
నెటులైన న్విడువుకున్న నెవ్వరికైనన్
ఘటియించు నరకవాసము
కటకట : సంసార మింత కష్టంబగునే ?86

అనుచు మహా ధైర్యంబున
జవనాథుఁడు సుతులు హరులు. సామజఘటలున్
ధనధాన్య వస్తుసంపద
లనయ మనిత్యంబటంచు నాశదొరంగెన్ . 87


ఇట్లు విరుక్తుండై యన్నరేంద్రుండు తొల్లి గురూపదేశ శాస్త్రంబులవలనం బడసిన విజ్ఞానంబున తాను శుద్ధచైతన్యం బనియును, తనయందు నారోపితంబైన ప్రపంచంబు తాననియు దెలసియు, జ్యోతిశ్శాస్త్ర విచారంబున గ్రహమండలస్థితి తెలిసియు గ్రహలోకప్రాప్తి లేనియట్లు మననంబులేమి