పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

31



ప్రళయతర రౌద్ర పరమకృపాసముద్ర
వినుత శతరుద్ర భద్ర శ్రీ వీరభద్ర ! 125

భవదీయ హుంకార పటుమరున్నిహతిచేఁ
            గుల పర్వతములు దిక్కులకుఁ జెదర
తావకోత్కట జటాతాడన ప్రౌఢిని
            ఘన శింశుమార చక్రంబుదిరుగ
యుష్మత్కరాగ్ర సంయోజితాసి స్పర్శ
            బ్రహ్మాండ మూర్ధ్య రంధ్రంబుగాఁగ
భవదుగ్రసింహ రావార్భటి మేరుమం
           దర గుహావళి ప్రతిధ్వనులు సేయ

నీవు వీరాంగమేయుచు నిష్ఠురముగ
దక్షు మఖవాటి కరుగుట దలఁపవశమె
ప్రళయతర రౌద్ర పరమకృపాసముద్ర
వినుత శతరుద్ర భద్ర శ్రీ వీరభద్ర ! 126

అని వినుతించెడి గణముల
వినుతులు చెవులార వినుచు వీరేశుఁడు దాఁ
జనె దక్షు యజ్ఞవాటం
బునకున్ గణరాజితోడ పురహరునాజ్ఞన్. 127

ఇట్లు చని ముందట ననంతమణి రుచిరానంతమణి గణభ్రాజిత ద్వారకవాట గేహళీ విరాజితంబును, రాజితాచలసంకాశ సౌధనికాయంబును, కాయమాన నివిష్ట విశిష్ట భూసుర వేదనినాదంబును, నాది తానేక వాద్యకూటంబగు దక్షుయజ్ఞవాటంబులోనికింజని తదీయ ద్వారంబులు నిరోధించిన గణంబులును, నిశితాశు గోద్దండ కోదండపాణులును, భండనప్రచండ గదాదండ మండితులును, వివిధాయుధథారులై తదధ్వరోపగతులై న గరుడ గంధర్వ