పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

27

వగుట నిన్నుఁజూచుచు నీ యజ్ఞవాటంబున నిలువఁగూడ దచిరకాలంబున శివాజ్ఞావశంబున నీమఖధ్వంసంబగు నీవు నిహతుఁడవగుదు వీసర్వసుపర్వ నికాయంబును శివనిందాశ్రవణదోషంబున నిప్పుడే శిక్షితులై చండాసురకృత బాధాపీడితులయి సర్వసంహార యోగంబున మృతిబొందెదరని శపించి కరద్వయీ పిహిత కర్ణపుటుండై లేచి చనిన దుర్వాసోజాబాల్యత్ర్యుపమన్యు గౌతమాది శై వర్షి సమాజంబు తోడనం జనియె. నా సభికులందఱు తదాజ్ఞా భయంబునం జనలేక నిలిచిరంత. 109


నారదుఁడు రజతశైలము
జేరి మహాదేవుఁజూచి సేవించి మహో
దారుఁడు దక్షుఁడు యజ్ఞము
వారక యొనరించె నిన్ను వర్జించి శివా ! 110

అని శివుని బలుక సతి విని
జనకుని యజ్ఞంబుజూడఁ జన మనసయ్యెన్
ననుఁబనుపు మనఁగ శంకరు
డనియె ననాహూత గమన మర్హమె నీకున్. 111

అన సతియు భవుని వాక్యము
వినియును నే జనకుయజ్ఞవిభవముజూడన్
జనియెదననె; శివుఁడంతట
పనిగొనఁ బ్రమధాళి నిచ్చి పనిచెన్ వేగన్. 112

అంతట నా జగజ్జనని యద్భుతదివ్య విమానయానయై
ప్రాంతమునన్ గణావళులు భక్తి భజింపఁగ దక్షుయజ్ఞ శా
లాంతర వీథికేఁగి సుషమాఢ్య విమానము డిగ్గి (పోయి) య
త్యంత మనోజ్ఞవేదిక మహావిభవంబున నిల్చె నయ్యెడన్. 113