పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము



స్రక్చందనాలేప సకల భూషణ వస్త్ర
             పర్యంక పంక్తు లేర్పడియె నేని
వర వయో లావణ్య సరసిజాక్షులతోడఁ
             దోరమౌ రతికేళి దొరకెనేని
సరసాన్నపాన సంసక్తి నిరామయ
             స్ఫురితాంగ విభవంబు పొసఁగెనేని

మత్తుఁడగు గాక శివభక్తి వృత్తుఁడగునె
నిరయగతిగాక కైలాస పురముఁగనునె
నీకు నిన్నియుఁగలుగుట నీచహృదయ !
శివునిఁ జింతింపనేరవు చెప్పనేల ? 107

విను దక్ష ! మేము నీ క్రియ
ఘనతపముల శివునిఁగూర్చి కావించియు శ్రీ
లను గోరకుంట యీగతి
జనియించును మదమటంచు చర్చించికదా ! 108

ఆయినను శివప్రసాదగతంబులై న సంపదలు విపరీత ఫలంబులఁ జేర్చునే యనిన నందు శివభక్తి వితథస్వార్థంబుగాఁగోరిన శివుండిచ్చు సంపదలును నిస్పృహుండైనను నయ్యీశ్వరానుగ్రహంబునం గలుగు సంపదలును భుక్తిముక్తి ప్రదంబులగు గాని రజస్తమోగుణగ్రస్తులై భోగార్థంబుగాఁ గోరిన నీశ్వరుండిచ్చు సంపదలు రావణాద్యసురులకుంబోలె మదంబుఁ బుట్టించు. నీవు భోగార్థంబుగాఁ గోరితి వట్లగుట విపరీతఫలంబు నొందఁగల వహో! శివనిందాఫలంబు నీ యట్టి ప్రజాపతి కమేయ దుర్గతింబొందింప సిద్ధంబయ్యె నింక మసుష్యమాత్రులు - శివనిందజేసినఁ బ్రాయశ్చిత్తంబులేని కతంబున ననేక బ్రహ్మకల్పంబులు ఘోరనరకంబునం గూలుదురని వేదపురాణ సిద్ధాంతంబులు వలుకుచుండు నేమి సేయవచ్చునని నిజకీర్తి విజిత సుధామరీచియగు దధీచి వగచి విషణ్ణుండై దక్షునింజూచిదక్షా! నీవు శివద్రోహి