పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

23రసాధరేంద్ర కార్ముకం - వసుంధరా మహారథం
పురాసురాపహారిణం - సదా సదా శివం భజే. 91

గజేంద్ర చర్మ వాసనం - నగేంద్ర శృంగ వాసినం
వృషేంద్ర దివ్యవాహనం - సదా సదా శివం భజే. 92

అశేష భక్త పోషణం - విశేష శేష భూషణం
ప్రసిద్ధ తత్త్వ భాషణం - సదా సదా శివం భజే. 93

అని వినుతించు దక్షుఁగని యా పరమేశుఁడు బల్కె నీదు నె
మ్మనమునఁ గల్గు కోరిక శుభం బదె యిచ్చెద నేఁడు నీకు ని
వ్వనజభవాది దేవమునివారము లాది జగంబు నీదు పం
పునఁ జరియింప నీవు నతిపూజ్య జగత్పతివౌదు వెంతయున్‌. 94

నీదు ప్రజ్ఞచే జగములు నిండియుండి
పుత్త్రులును పుత్త్రికలు గల్గి భూరిభోగ
శాలి వయ్యెదు నీయాజ్ఞ సకల భూత
చయము తప్పక నడచు నిశ్చయము గాఁగ. 95

అంత శర్వాణి కరుణమై నతనిఁజూచి
కోర్కెయేమైనఁ గలదేనిఁ గోరుమనిన
దక్షుఁడిట్లనె; “దేవి ! నా తనయవగుచు
పుట్టు” మన నట్లె వరమును బొసఁగనిచ్చె. 96

ఇట్ల య్యుమామహేశ్వరులు నిజభక్తుం డగు దక్షునకు సకలాభీష్టంబు లొసంగి యంతర్ధానంబు నొందిన నతండంత నిఖిలైశ్వర్యసంపన్నుండై ప్రజాపతియయ్యె. భవానియు సతీనామంబునం బుత్త్రికయై జనించె నద్దేవిని శివునకిచ్చి వివాహంబుజేసి యఖండైశ్వర్యానుభవంబున మదోన్మత్తుండై యొక్కనాఁడు హర్యజాద్యమర్త్యులంగూడి పుత్త్రీజామాతృ దర్శనార్థంబు