పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము

ధించిన భుక్తిముక్తు లీ జన్మంబు నందె చెందెద" వనిన నతండును మేరునగ ప్రాంతంబున బహుకాలంబు జితేంద్రియుండై ఘోరతపంబుఁ జేసెనంత. 86


శతకోటి చంద్ర మోద్భుత దేహరుచితోడ
           పటు జటామకుట విభ్రమముతోడ
నీలకంధర నీల నీలకంఠముతోడ
           రమణీయ సర్ప హారములతోడ
కుందేందు రుగమంద మందహాసముతోడ
           కరుణా కటాక్ష వీక్షణముతోడ
వరదాభయ మృగాగ్ని కరచతుష్కముతోడ
           కటి తట పటుచర్మ పటముతోడ

వామ భాగస్థ పార్వతీ భామతోడ
నమల రుచిఁ బొల్చు నంది వాహనముతోడ
నతు లొనర్చెడి‌ ప్రమథ గణంబుతోడ
దక్షునకు నంత శివుఁడు బ్రత్యక్షమయ్యె. 87

ఆ పరమేశుఁ జూచి నయనాంబుజముల్‌ వికసింప దక్షుఁ డు
ద్దీపిత భక్తియుక్తి నతి దీనగతిన్‌ వినుతుల్‌ ఘటించి యో
తాపసవంద్య నీచరణదాసుని నన్నుఁ గృతార్థుఁ జేయవే
పాపముఁ బాపి భక్తజనపావన యంచు నుతించె నీక్రియన్‌. 88

వృత్త స్తవము :

ముదా సదార్తి భంజనం - పదాహతార్క నందనం
విదారితాఘ సంఘటం - సదా సదా శివం భజే. 89

ఉమా సతీ మనోగతం - రమాధినాథ సేవితం
శమాఢ్య యోగి భావితం - సదా సదా శివం భజే 90