పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

21



మోదంబుతోడఁ బలికెను
“వేదార్థము మిగుల నీకు విశదం బగుటన్. 81

భుక్తి ముక్తుల నిప్పుడే పొసఁగనిచ్చు
దైవ మెవ్వఁడొ తెలుపవే తండ్రి !" యనుచు;
"పుత్త్ర! శివుఁడొక్కడుఁన్నాఁడు భుక్తి ముక్తు
లిప్పుడే యిచ్చు దైవ మయ్యీశుఁ దలఁపు.” 82


అని విధి పలికిన దక్షుం డిట్లనియె. 83


“హరుండంచును హరియంచును
సరసిజగర్భుండటంచు శక్తియటంచున్
బరువడిఁ బల్కెద రిందునఁ
బరుఁడెవ్వఁడొ నాకుఁ దెలియ బలుకు విరించీ ! 84

అన విధాతయు నిట్లనె నాదరమున
"శ్రోతృ చిత్త విపాకంబుజూచి శ్రుతులు
హర్యజాదులు పరతత్త్వమని వచించె
గాని నిక్కంబుగాఁగ శంకరునిఁ బలుకు. 85

మఱియు వేదంబు లొక్కొక్క యంశంబున హర్యజాది దేవతలకుఁ బరతత్త్వం బాపాదించి సర్వాంశంబుల శివ పరతత్త్వంబే సాధించుఁ గావున వేదశాస్త్ర పురాణాగమ జాలంబులు సాంతంబుగాఁ జూచిన వారలు శివునియందె పరతత్త్వంబు నిస్సంశయంబుగాఁ బలుకుదురు. వీని యంశాంశ మాత్రంబె చూచినవార లితర దేవతలయందే పరతత్త్వంబు నిశ్చయించి నిస్సంశయంబుగా వాదింపు చుండెదరు. వేదంబులు మన్ముఖోద్గతంబు లగుట తదర్థంబు నాకతి విశదం బందువలన శివుండే పరబ్రహ్మంబని యేను నీకుఁ దెలిపితి నీవును నమ్మహా దేవునికి భక్తియుక్తుల నారా