పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము


కాని యిటువంటిస్థలములఁ గాన మనుచు
నిక్క మే బాసకైనను నిల్చు వార
మనుచు నందఱు నొక్క వాక్యంబుగాఁగ
బలికి రా మాట విని నేను బరమభక్తి. 60

అమ్మహాస్థలి కధీశ్వరుండగు త్రికోటీశ్వరలింగంబునకు నమస్కరించి కంచి కాళహస్తి చిదంబర కుంభకోణ రామేశ్వర శ్రీరంగ వేంకటాచల వృద్ధాచల మంగళాచల కాశి గయా ప్రయాగ శ్రీ పర్వతాది మహాస్థలంబులకు స్థలపురాణంబులు గలిగియండ ని మ్మహాస్థలంబునకు స్థలపురాణంబు లేమి కేమి కతంబోయని విచారింపుచు మరునాఁ డ న్నగేంద్రంబుడిగ్గి మ న్నిలయంబగు క్రోసూరి పురంబున కభిముఖండనై వచ్చునెడ మార్గంబునందు, శ్రీగిరి ప్రాంత నిలయుండును నుద్భటారాధ్య వంశజుండును ముదిగొండ వీరభద్రారాధ్యవర్య పౌత్రుండును కేదారలింగంబను నారాధ్యపుంగవుం డద్దేవు సేవింప నరుగునెడ నెదురైన నేను నమ్మహాత్మున కభివాదనంబు వేసి మదీయ చిత్తగతంబగు సంశయం బెఱింగించిన నమ్మహామహీసురుం డది విని మున్ను చిదంబరనటనతంత్రంబున శివుండు మాదేవికిఁ జెప్పిన విధానంబు జెప్పెదవినుము. దక్షాధ్వరధ్వంసానంతరంబున శివుండు క్షైలాస కుధరంబున దక్షిణామూ ర్తియై సమాధినిష్టం గూర్చుండిన బ్రహ్మోపదేశార్థం బచ్చటి‌ కరుదెంచిన సనకాదులం దోడ్కొని యీ త్రికూటాచల మధ్యకూటంబు ప్రవేశించె నందువలన నీ స్థలం బెల్ల మునులకు నివాసంబగుట నెల్లమంద యని జనంబులచేతఁ బలుకఁబడె నిట్టి‌ కథా విధానం బీవును నాంధ్రభాష నతిస్థిరంబుగా స్థలపురాణంబుగా రచియింపు మని యానతిచ్చిన నేను నిది శివప్రసాదంబుగా నంగీకరించి మదీయాభీష్ట సిద్ధి కిదియె కారణంబని తలంచి చిదంబర నటన తంత్రోక్తప్రకారంబున నీ కృతి రచియింపంబూని యేతన్మహాప్రబంధంబునకుఁ గృతినాథు శ్రీశైల నాథుంజేయుట యిహపర సాధనంబని తలంచి. 61