పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్ర థ మా శ్వా స ము

13


వేదశాస్త్ర పురాణ వివిధాగమస్మృతీ
            కవితాద్యలంకార కావ్యవేది
వేదాంతసార మేధా దక్షిణామూర్తి
           మను జపతోషిత మానసుండు
సకల రాజన్య సంసన్మధ్య సంచారి
          విద్వజ్జనానీక వినుతకీర్తి
మంత్రలయ హఠాది మహిత యోగాభ్యాస
          సాధిత బ్రహ్మైక్య సమరసుండు

విమలచిత్తుండు షడ్వర్గ విజయశాలి
కొప్పరాజ కులాంభోధి కువలయాప్తుఁ
డైన లింగన మంత్రీంద్రుఁ డమ్మహాత్ముఁ
బూని కొనియాడ దరమె వాగ్జానికైన. 52

తమ్ము లిరువురు నుభయ పార్శ్వమ్ము లందు
వామ దక్షిణ భుజములవలె భజింప
నొప్పు రాజన్యసభల దా నుచిత లీల
కావ్య రచనా చమత్కృతుల్‌ గనినవాఁడు. 53

రసము లొలుక విద్వన్మనోరంజనాఖ్య
మయిన కృతి చెప్పి వీరభద్రాంకితంబుఁ
జేసె, శంభు స్తవంబులు జేసెఁ బెక్కు
శివ గణాగ్య్రుండు లింగన కవివరుండు. 54

వారిధితుల్య గుండిమెడ వంశజ వేంకట కృష్ణ మంత్రికిన్‌
భూరి వివేక వేంకమకు బుట్టిన కన్యక లక్ష్మమాంబికన్‌
వీర పతివ్రతాతిలక విశ్రుత లింగన మంత్రి పెండ్లియై
కూరిమిఁ బుత్త్రుఁ గాంచె ననుఁ గోవిదమిత్రుని నారసింహునిన్. 55