పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

6

శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యముతదీయ పుత్త్ర పౌత్త్ర పరంపరాభివృద్ధియగు నిమ్మహావంశంబునందు, 22

రక్షించె నెవ్వాఁడు రాజీవజాన్వయ
          సంజాత జనుల నాసక్తి తోడ
శిక్షించె నెవ్వాఁడు శితశస్త్రధారచే
          మత్త దుష్ట విరోధి మండలంబు
వీక్షించె నెవ్వాఁడు వెసఁ దల్లిమాఱుగా
          నైజాంగనాన్య పంకేజముఖుల
ప్రోక్షించె నెవ్వాఁడు భూరిదయాసుధా
          సారంబు దీనవ్రజంబుమీఁద

నతఁడు శ్రీ కొప్పరాజాన్వయాబ్ధి చంద్రుఁ
డనఁగ నుదయించెఁ గువలయావనవిధిజ్ఞుఁ
డైన వీరయ నామధేయాంక మంత్రి
మంత్రిమాత్రుండె భువనైకమాన్యుఁ డరయ.23

ఆ వీరప్రవరుండు గాంచె సుతు భవ్యాకార సుశ్రీ యశః
శ్రీ విద్యా బల శౌర్య ధైర్య గుణవిస్తీర్ణ ప్రబోధావన
ప్రావీణ్యంబున నాత్మసన్నిభుని వీరామాత్యు దీపంబు దీ
పావిర్భావము నొందఁజేయుగతి శైవాచారసంపన్నుఁడై. 24

ఆనరసుతుఁ డతనికి ది
ఙ్మానవతీ మౌళిభాగ మానిత సుయశః
సూనుఁడగు సూనుఁడై తగె
సూనాయుధు చక్కఁదనము శూన్యము గాఁగన్.25

హిమగిరి సేతుమధ్యమున నెల్లెడ నున్న ధరామరాళి క
త్యమిత వినూత్న రత్నములు నశ్వకలాప రథాగ్రహారముల్