పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

17

మొదలగు పద్యములు చూడవచ్చును. అఖిల చ్ఛందోమయుఁడగు పరమేశ్వరుని దేవేంద్రునిచే వివిధ చ్ఛందోమయ స్తోత్రమున స్తుతింపఁజేసిన కవి యుచితజ్ఞత మెచ్చఁదగినది.


“తరుణి మాకు విరోధి నీ ధవుఁ డతండు
ప్రేత భూత పిశాచ సత్ప్రియ సఖండు
యజ్ఞభూమికి నరుదేఱ నర్హుఁడగునె ?
అతని సతివౌట నీవు ననర్హ విపుడు."

ఇందు 'ఇపుడు' అను పదము మిక్కిలి భావగర్భితము. ఇట్లు పదములను సముచితముగ వాడిన పట్టులు పెక్కు గలవు.

ఈ పద్యమందలి ధారాశుద్ధి, జూడుఁడు :


కాము మెక్కు వౌను కడియ నోటికిఁ బోదు
ధనమున౦దుఁ బ్రేమదగులు మిగుల
చిక్కువడుచునుండుఁ జింతల వంతల
ముదిమి మోక్ష సౌఖ్యమునకు తెరువె ?

భక్తిరస భరితములై న యిట్టి సత్కావ్యములలో నెరసులు పరికించుట సరసుల పని కాదుగదా ! ఇహపర సాధనమైన యిట్టి మంచి కావ్యమును వెలుఁగులోనికిఁ దెచ్చుటకై మిక్కిలి శ్రమపడి సఫలుఁడైన మా సోదరుఁడు విద్వా౯ భాగవతుల వేంకట సుబ్బారావును, ఆతనికి, దోడ్పడిన నరసరావుపేట నగరపాలికాధ్యక్షులు శ్రీ కొత్తూరి వేంకటేశ్వర్లగారు మొదలగువారలకును మా హృదయ పూర్వకాభివందనములు.

3 - 4 - 862 బర్కత్‌ పూరా,

హైదరాబాదు.

31 - 8 - 1959.

శ్రీనివాస సోదరులు

శతావధానులు.