పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/193

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

154

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


వితతిఁ గూర్తురు శివరాత్రివేళ, రాత్రి
రాత్రి యని తోఁచ దా దీపరాజిచేత. 319

కోటీశుం బరమున్‌ గిరీశు నభవున్‌ ఘోరార్తి సంహారకున్‌
జూట స్థేందుకలాకలాపు గిరీశుం జూడంగ నేతెంచి య
ప్పాటం గృత్యములన్నియున్ విడిచి హృద్వ్యాపారశూన్యంబుగాఁ
బాటిన్ నిల్తురు యోగు లచ్చటను శుంభల్లింగ లీనాత్ములై. 320

ఒక్కొక ప్రభకడ నుత్సవ
మక్క జముగఁ జూడఁ గాల మరిగిన జనమిం
కెక్కడ నీప్రభ లన్నియు
నక్కట ! జూడంగగలమె యని చింతిలుచున్. 321

ఒక ప్రభముందట న్నిలిచి యుత్సవముంగనుఁగొంచునుండ వే
ఱొక ప్రభరాఁ దదుత్సవము నొప్పఁగజూచెడునంతలో ప్రభా
నికరము నాల్గుదిక్కులను నిల్చినఁ జూడ నశక్యమౌటచే
నకట సహస్ర లోచనము లబ్బినఁ జూతుమటందు రజ్జనుల్‌. 322

ఇట్టి యుత్సవ మొకదినం బెంచిచూడ
వచ్చు నొక యేటికిని బంచివైచిరేని
దిన దినోత్సవమైయుండు దెలియఁజూడ
వచ్చునని యెంతు రచటికి వచ్చు నరులు. 323

ప్రభకు నొక్కొక్కలింగ మేర్పడగనుండు
సూటి వీక్షించి యీప్రభాకోటి కెల్ల
నీశుఁడగుటను శివుడు కోటీశనామ
మొందెనని యెంతు రచ్చటనుండు జనులు. 324

మఱియు నీ మహోత్సవాడంబరం బీక్షించి యధిష్ఠాన బ్రహ్మ సాన్నిధ్యంబున సృష్టి కాలంబున బహు విచిత్రంబగు జగంబు ప్రకాశించి విలయ