పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

153

కొన వేడుక లమందముగ నిందుధరుచందములు సూచి ముదమొందుదురు భక్తిన్. 315


కరకంజంబుల నిష్టలింగముల రంగల్లీలతోఁ గూర్చి దు
స్తర సంసారపయోధి నావ యగు థాన్వచ్ఛంభు పూజన్ మహా
దర భావంబున జేతు రెంతయు మనస్తాపంబు చల్లాఱగాఁ
బరమానందత వీరశైవు లచటం ప్రజ్ఞావిశేషంబునన్. 316

భక్త మాహేశాది ప్రథితస్థలంబుల
             నారోహణావరోహతఁ దనర్చి
ఇష్టంబు ప్రాణంబు నేకమై దనరార
             గురులింగ జంగమగురు కటాక్ష
లసదీక్షలను నాఱు రసములఁ జెలువొందు
             నాచార ముఖ్య లింగార్పణముల
సర్వ జగద్వస్తు సంఘాత మర్పించి
             పరశివై క్యానంధ పదము నొంది

వీరశైవులు శివపూజ వివిధగతులఁ
జేయుదురు త్రికూటాద్రీంద్ర సీమయందు
తన్మహత్వంబు వర్షింపఁ దరముగాదు
కమల గర్భునకైన నిక్కంబుగాను. 317

పీఠములమీఁద లింగముల్‌ వెట్టి భక్తిఁ
బూజ సేతురు కోటీశమూర్తు లనుచు
పూర్వశైవులు నవబిల్వ పుష్పసమితి
శంభు సాహస్రనామముల్‌ చదువునియతి. 318

బ్రాహ్మణాంత్యజకులము లేర్పఱుప రాక
యుండ నక్కొండదండ నఖండ దీప