పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/191

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

152

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


చింతామణి సురతరుతతు
లెంతేనియు దా జడములయ్యు నిష్టంబొసఁగన్‌
కంతుద్వేషి చిదాత్మకుఁ
డెంతైనన్‌ భక్తతతికి నిచ్చుట యరుదే ! 312

బహు పుత్త్రపుత్త్రికా ప్రాభవైశ్వర్యముల్‌
           ధనధాన్య వస్తువిస్తారములును
హయగజ పశువృద్ధి యమిత తేజస్ఫూర్తి
           యుభయలోకములందు నభయవృత్తి
నిజకళత్ర సుఖంబు నిఖిల సమృద్ధియు
           కన్నులు కాళ్లు నంగముల బలిమి
శత్రుసంహారంబు మిత్రసంబంధంబు
           బడయఁగఁగోరి యా ప్రజలు మది న

ఖండ దీపంబు లెంతయుఁ గొండఁ దిరుగు
టయును హేమ రాజిత తామ్ర మయములైన
ప్రభలు హేమరజిత పుష్పపటలి యాది
గాఁగ మ్రొక్కులు మ్రొక్కి యుత్కంఠతోడ. 313

మీఁది శివరాత్రికిని వచ్చి మీకు మ్రొక్కు
మ్రొక్కులెల్లను జెల్లింతుము దయఁ బ్రోవు
మభవ! కోటీశ! యని దిశాయాతజనము
లుత్సవము సేతు రెంతయు నుచిత లీల. 314

లయగ్రాహి :

కొందఱు తటాకములఁ గొందఱు సువాపికలఁ గొందఱును ద్రోణికలఁ కొందఱు మరాళా ! నందకర పద్మినులయందునను స్నానములు పొందుగ నొనర్చి నరబృంద మిరువంకన్ సందడులు సేయుచు నమందగతిచేత గిరిక్రిందుగ ప్రదక్షిణము లందముగఁ జేయన్ ! గ్రందు