పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

151


లీలన్ వేఁగ బ్రసన్నమూర్తియయి గౌరీశానుఁ డిష్టార్ధముల్‌
చాలాయిచ్చుట లేదటంచు జనముల్‌ చర్చింతు రచ్చోఁ దగన్. 306

ఈ త్రికోటీశు కరుణచే నిష్టసిద్దు
లొదవు మాకంచు జనుదెంతు రుర్విజనులు
ఈ త్రికోటీశు కరుణచే నిహమునందె
ముక్తియగు నంచు వచ్చు ముముక్షు వితతి. 307

ఇంద్రవ్రజము :


కోటీశ కోటీశ త్రికూట యంచున్
పాటించి కీర్తింతురు భక్తు లెల్లన్‌
కూటస్థుఁడీ లౌకికకోటి కెల్లన్‌
గోటీశుడే యంచును గోర్కెమీఱన్‌. 308

వనతరుచ్ఛాయలను నిల్చి వనజపత్ర
శతములను బూజసేతురు సర్వమయుని
కోటిలింగేశు విశ్వేశు కోటికోటి
పద్మజాండాధినాథుని భక్తి తోడ. 309

మగధ పాంచాల కోసల మద్ర పాండ్య
చోళ కురు కాశ మత్స్య నేపాళ గౌళ
సాల్వ కుంతల ముఖ్యదేశస్థ జనులు
వత్తురా కోటిలింగోత్సవంబుఁ జూడ. 310

వచ్చి తమ కోరుకోర్కులు
విచ్చలవిడి కోరుకొనుచు వెనుకటి మ్రొక్కుల్‌
సచ్చరితులగుచు దీర్చుచు
మచ్చిక కోటీశుఁ జూచి మఱలుదురు వెసన్‌. 311