పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/189

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

150

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


క్రింది యుత్సవములఁ బొందుగా నీక్షించి
             బహుళోత్సవంబు లీపర్వతమున
బరగుచున్నవటంచు భ్రాంతిచే భావించి
             యందె ; నిల్చిరి గిరిక్రింద జనులు
క్రిందటి ప్రభల నింపొందు నద్దములందు
             కుధరంబుపైనుండు గుడినిగాంచి

అచటి భక్తులఁ బ్రోవఁ గోటీశ్వరుండు
పరగ గుడితోడఁ గ్రిందికి వచ్చె ననుచు
భ్రాంతి నీక్షించి యచటనే పాయకుందు
రద్భుతముగాదె యాచంద మరసిచూడ.302

గిరిక్రింద నుండు జనములు
పరగన్ దమరుండుచోట భక్తిస్ఫురణన్
వర లింగమూర్తి నిలుపుచు
గరిమన్ బూజింతు రిష్టకార్యార్థముగన్. 303

తద్గిరిప్రాంత కాంత కాంతారమందు
వీరమాహేశ్వరాచార విధిఁ జరించు
భక్తతతికి గోటీశ్వరార్పణముగాఁగఁ
జెలఁగి మా హేశ్వరార్చనల్‌ చేయుచుంద్రు. 304

బహురుద్రాక్షజటాధరుల్‌ సతతమున్ భస్మత్రిపుండ్రాంకితుల్‌
ముహురుద్ధూళన దీప్తదేహు లతిసమ్మోదాత్ము లుద్యన్మతుల్‌
బహిరంతస్థిత లింగలీన హృదయప్రాణేంద్రియౌఘుల్‌ మహా
మహు లేతెంతురు తత్త్రికూటపతిప్రేమన్ బూజగావింపఁగన్. 305

కై లాసంబుననై న దక్షిణదిశా కైలాసమందైన హృ
త్కాలుష్యంబులు బాపు శ్రీనగ హిమక్ష్మాభృత్తులందైన నీ