Jump to content

పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

149


నగరాజమెక్కు ప్రభలును
దిగు ప్రభలును గుడికిఁ జుట్టుఁ దిరిగెడి ప్రభలున్
దిగువ ధరాతలమందున
మిగుల న్వసియించు ప్రభ లమేయము లచటన్. 298

మఱియు దిగువ నిలుచు ప్రభ లనంతంబు లందు నొక్కొక్క ప్రభాసమీపంబున వీరాంగ వాద్య నృత్య విద్యావిలాసంబు లమేయంబుగా బ్రవరిల్లు చుండు నెంతయు. 299


శరదభ్ర సన్నిభ సామజ సంఘము
           ల్ఘనతరాంతస్థ నక్రములుగాఁగ
నవవిధ వాద్య సన్నాదముల్‌ తత వాయు
           జనిత తరంగ ఘోషములుగాఁగ
పర్వతస్థాపి తాఖర్వ దీపచ్ఛటల్‌
           రాజితాంతర్లీన రత్నములుగ
పవమానవేగ సంప్లవమాన కేతన
           పటములు వీచికా పటలములుగ

బరగి యీ యుత్సవముఁ జూడవచ్చినట్టి
యఖిల దేశాగత మహాజనాంబురాశి
తనరి కోటీచంద్ర నందర్శనమున
పొంగిపొరలి నగేంద్రంబు ముంచకున్నె. 300

ఆకసమునుండి భూమికి నరుగుదెంచి
యుత్సవముజూచు తారల యొప్పు దెలిపి
కొండ క్రిందను దీపితాఖండ దీప
వితతిభాసిల్లు నద్భుతోన్నతిఁ దనర్చి. 301

పై నున్న జనము లాపై న నిల్చినయట్టి
            ప్రభలకుఁగట్టు దర్పణములందు