పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

146

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


సేతు కాశీ పురాంతర ఖ్యాత భూము
లేఁగి చూచితి మీ చిత్ర మెందు లేదు. 283

అని చింతింపుచు దేవదేవుని మహార్హావాస ప్రాగ్ద్వార మం
దున నందీశ్వరుఁ జూచి మ్రొక్కులిడి ముందుంబోవ నూహించి యా
జన సమ్మర్దము జూచి భీతిలుచు నోజన్ గోటిలింగేశ్వరున్
గను టెట్లో యిట నంచు నెంచుచు మదిం గాంక్షల్‌ విజృంభింపఁగన్. 284

ఎట్టకేలకు గుడిలోన నెట్టుకొనుచు
బోయి యిచ్చట గుడ ఘృత భూరి శాలి
తండుల సువర్ణ కలధౌత తామ్రఖండ
ములను కానుక లిచ్చి సమ్మోద మొదవ. 285

కోటీశాభిధ లింగమూర్తిని జగత్కోటీశు నీక్షింపుచున్
సూటిం జూపుల వెంటనంటి మదిలోఁ జోద్యంబుగా నిల్చునా
కోటీశాకృతి బైటికేఁగునని సంకోచించి నేత్రంబు ల
ప్పాట న్మూసిరనం బ్రహర్షమున రెప్పల్‌ మూతు రచ్చో జనుల్‌. 286

అట్లు సలలితానంద మహానుభూతిఁ
బూత చేతస్కులై తమ మ్రొక్కులెల్ల
దీర్చి మఱలంగ మ్రొక్కుచు దిగి నగేంద్ర
ముత్సవంబులు గావింతు రుర్వియందు. 287

అందు బ్రాహ్మణు లా నగేంద్రాగ్రసీమ
నిలిచి యుపవాసములు జేసి నిద్రమాని
ఘనత మీఱి లింగోద్భవ కాలమందు
పూని గోటీశునకు బిల్వపూజ జేసి. 288

అచ్చోటి యుత్సవమును వి
యచ్చర సేవ్యంబుఁ జూచి యద్భుత మొదవన్