పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/177

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

140

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


ఆత్రికూటాద్రి సన్నిధి నద్భుతముగ
వీథికాశత సాహస్ర విపణిలక్ష
లక్షితంబౌచు హయగజరథపదాతి
బూరితంబై న యొక మహాపురము దనరు. 263

ఆపురవీథులందు వణిగగ్రణు లంగణసీమలన్‌ మహో
ద్దీపిత వస్తుజాలములు దెచ్చి నగంబులరీతి రాశిగా
దాపుటచేత సజ్జనవితానము తృప్తివహించి భూమియం
దేపురమందునై న గలదే యిటులంచుఁ దలంచు నెంతయున్‌. 264

ఒకవంక నవవిధప్రకట ధాన్యశ్రేణి
          యొకచోట ఫలరాసు లొక్కయోర
కర్పూర కస్తూరికా గంధసారంబు
          లొకచెంత గుడసితా సుకరమధువు
లొకసీమ నవరత్న నికరపేటిక లొక్క
          చో మణిభూషణస్తోమ మొక్కు
యెడ చిత్రవస్త్రాళి యేర్చడ నొకచాయ
          దారులోహజ సుసాధనచయంబు

గలిగి విశ్వమునందునఁ గలిగినట్టి
వివిధ వస్తుపరంపరల్‌ వెలయుచుండ
సకల భోగై కనిలయమై సకలసౌఖ్య
భవనమై యొప్పుచుండు నప్పట్టణంబు. 265

అందుండు సర్వజనములు
పొందుగ శివరాత్రినాఁడు భోగస్థితులం
జెందక యాకోటీశ్వరు
నందె మనోరూఢి నిలిపి యచలస్ఫురణన్. 266