138
శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము
నందివాహనము లానందమొంద ఘటించి
యామీఁద లింగంబు నమర నిల్పి
ప్రభలు రచియించి శకటముల్ వాహకులును
మోసికొనిరాగ వీరాంగములు చెలంగ
ప్రజలు సనుదెంతు రానందభరితు లగుచు
నెల్లమందేశుఁ గోటీశు నీశుఁ జూడ. 258
ఊరూరం బ్రభ లేగుదెంచు నెడలన్ యోగ్యంబుగా ముందటన్
వీరాంగంబు శివంబులాడు జనముల్ వేశ్యాంగనా నాట్యముల్
భేరి మర్దళ కాహళ ధ్వను లఖర్వీభూతమై నిండ వి
స్తార ప్రక్రియ సేవ సేయుదురు రాజద్వీథులం దెంతయున్ . 259
ఏవీటం గనుఁగొన్న నచ్చటనె కోటీశుండు ప్రత్యక్ష స
ద్భావం బందిన యట్లు దోఁచెడిని శుంభల్లీలఁ దత్సేవలం
దావిర్భూత మహోత్సవంబుగన నాహా యిట్టి యాశ్చర్యముల్
లేవెందుం జతురబ్ధి మధ్య యగు నుర్వి న్సర్వదేశంబుల౯. 260
మఱియుఁ బ్రాగాద్యష్ట దిగంతరాళంబులనుండి మహాపథంబులంజను దెంచు సితాసిత పీతారుణ ప్రభాసముదాయంబులగు ప్రభానికాయంబులు నలుగడల మహోత్తుంగ మృదంగ శంఖపటహకాహళ వీణా వేణుతాళఘంటా నినాదంబు లొక్కమొగి నాకాశం బనవకాశంబు నేయుచు, నసంఖ్యాకంబగు జనం బరుదేఱ నందు వేదశాస్త్ర పురా గమ తర్కవ్యాకరణ మీమాంసా కావ్యనాటకాలంకారాది విద్యలు శిష్యగణంబులకు బాఠంబుఁ జెప్పుచు దారపుత్త్రబంధు సహితముగా వచ్చు బ్రాహ్మణ కదంబంబును, కదంబకుసుమ గుళుచ్ఛచ్ఛాయాచ్ఛాదిత పృష్ఠభాగంబులై జలధరాంతర్గత జలం బాకర్షించి నిజభూత్కారంబుల దెసలు నిండం బ్రవహింపంజేయు చందంబున శుండా దండంబులు మీఁది కెత్తికొనిచను మహోద్దండ వేదండ తండంబులును, వేదండతండంబుల ననుసరించి పథంబునఁ దపన తాపంబునఁ గందు జనం