పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

135


బర్వు పిపాసఁ బాపఁగ శుభాంబువు లచ్చటఁ గల్లజేసి యా
శర్వునిఁ బ్రీతుఁజేతునని సాగరవల్లభుఁ డేఁగు దెంచెడిన్. 246

దరఁ గోటీశ మహోత్సవాగత సుభక్తశ్రేణి మార్గంబునన్
స్ఫురితోష్ణాంశు మయూఖపుంజములచే శోషింపకుండంగ స
త్వరతం బోయి తదీయ ఘర్మజలముల్‌ వారింప గోటీశ్వరా
దరణంబందెద నంచు నాపవను డుద్యత్ప్రీతి నేతెంచెడిన్. 247

ఎనయ నిధిప్రదాత జగదీశుని మిత్రుఁడనై తదుత్సవం
బున ఘనవైభవంబులను బూర్తియొనర్పకయుంట యొప్పునే
యని ధనదుండు యక్షనివహంబులు గొల్వ విమానయానుఁడై
ఘనమతియై త్రికూటపతిఁ గన్గొనవచ్చును స భ్రమంబునన్. 248

పరమేశానుఁడనయ్యు దిక్పతులలో భాసిల్లి యేనుంట సు
స్థిర కోటీశ మహోత్సవంబునకు నీ దిక్పాలకశ్రేణితో
సరిగాఁ బోవలెనంచు నెంచి మది నీశానుండు వేంచేయు భా
స్వరతారాచలకూట సన్నిభ మహోక్షారూఢుఁడై వేడుకన్. 249

హర్యజుల్‌ సతతంబు హర్యజనామక
            శిఖరస్థులయ్యును శివమహోత్స
వాడంబరముఁ జూడ నమరులతోడుత
            తమలోకములనుండి తత్త్రికూట
శైలయాత్రకుఁ బోవ స్వాంతంబునను గోర్కె
            జనియింప బరివారసహితులగుచు
వై కుంఠ సత్యలోకౌకసుల్‌ గుమిగూడి
            కడువేడ్కతోడ వెంబడిని నడువ
శ్రీమహాలక్ష్మీ వాణియుఁ జేరి కొలువ
బ్రబల ఖగరాజ సితగరు ద్వాహనముల