పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యము


భుజంగవ్రయాతము :

భుజారూఢ భోగింద్రభూషావిశేషున్‌
నిజానందుఁ గోటీశు, నిత్యంబు గొల్వన్‌
గజస్యందనాందోళికాయాన జాలం
బజస్రంబు గల్గున్‌ మహామాయ గెల్చున్‌. 210

ఒక మహాస్థలి కీశుఁడై యొప్పుచున్న
దై వమును గొల్చి ముక్తికిఁ బోవవచ్చు
నిమ్మహాస్థలిఁ గోటీశు నెసఁగఁ గొల్చి
యేవి కాంచంగవచ్చునో యెఱుగరాదు. 211

స్రగ్ధర :

కోటీశున్ గోపవాహున్ గులిశ ధరనుతున్ ఘోరపాప ప్రణాశున్
జూట స్థాబ్జారిఖండున్ సుమహిత ఫణీరా ట్ఛుభ్రహారాభిరామున్
పాటీరాంభోజ తారాపతి సుశర శరద్వారిదోదారకాంతిన్
సూటిన్ సేవించిరేనిన్ స్ఫురతరవిభవస్ఫూర్తియున్ గీర్తులొందున్‌. 212

దొనల నీరంబు లభిషేకమునకు గలుగ
దనర భూజింప బిల్వ పత్రములు గలుగ
వని ఫలంబులు నై వేద్యమునకు గలుగ
ఏల యర్చింప రీ దేవు హీనమతులు ? 213

అనుచు నందఱు వినఁ బల్కి య మ్మహాత్ము
డాత్మ చిత్తంబుఁ గోటీశునందు నుంచి
యన్య మెఱుఁగక యానంద మతిశయిల్ల
చలన మెంతయు లేక నిశ్చలత నిలిచి. 214

అంతఁ గొంత కాలంబునకు లబ్ధస్మృతియై సాలంకుం డ మ్మహాశివరాత్రి జాగరణోపవాస శివలింగ దర్శన బిల్వపత్రార్చనంబులు యథావిధిం