పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

117వ్రతము మానకయుంట యద్భుతము గాదె
యేమి కారణ మెఱిగింపు మిందువదన ! 140

అనినంత నా తలోదరి యిట్లనియె. 141

గురుని మహోపదేశమున గూడిన మోక్షముగాంచి యంత న
గ్గురు విడనాడఁ జెల్లునటె? కోవిదవందిత యట్ల నేను నిం
దరయ వ్రతానుభావమున నాఢ్య భవత్కృప కర్హనౌచు ని
ర్భరత వ్రతంబు మానుట శుభంబగునే తలపోసి‌ చూడగన్ ? 142


అన ముని పల్కు, నో యతివ ! యారయ నీ వచనంబు నుత్యమై
నను భవదీయ కష్టము మనంబున నేను సహింపలేక యి
ట్లనుటయె కాని సద్వ్రతము లక్కట ! యెందును మానవచ్చునే ?
వనజదళాక్షి ! నీ నిజనివాసము జేరుము నేన వచ్చెదన్. 143

నేనువచ్చిన నీ వింట నిలిచి వ్రతముఁ
గడుపఁగా వచ్చు నాయానకలన నీకు
లేకయుండెడు నట్లౌట లేమ నీదు
భవనమున కేగు నీవెంట వత్తు నేను. 144

మరలి చూడక యరుగు మేమరక నీవు
నెచట మరలెద వచ్చోట నేను నిల్తు
ననిన మునివాక్యమాలించి యంబుజాస్య
ముందుగా నేఁగె మునియు పిఱుందనరిగి. 145

ఇట్లు ప్రాచీన కోటీశ్వరస్థానంబునందుండి య య్యాభీరాంగన ముందర వేఁగుచుండ వెనుక నమ్మహాత్ముండు మంధాన కుధర మథన కంధికబంధ శంభూత మహోద్భటార్భటిం జనుచుండఁ దదారావాకర్ణన విదీర్ణ కర్ణపుట యగుచు భీతిల్లి సోపానమార్గమధ్యంబున నిలువంబడి మఱలి చూచె నంతట. 146