పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/135

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీమత్త్రికూటాచలమాహాత్మ్యముచును డెందములు సౌఖ్య స్పందగతి లింగములయందు నలియింపుచు
పురందరముఖామరుల కందని మహత్త్వం | బందగల భక్తులను కొందఱిని
జూచీ మది సందడిలు భక్తి ముద మంది యతఁ డంతకా.74

ఇచ్చటను శంకరార్చన
విచ్చల విడిఁజేయ మదికి వేడుకపు
సచ్చరితు లిచట నీశ్వరు
నచ్చుగఁ బూజింప మోక్షమందుట యరుదే :75

అనుచుఁ జింతించి సాలంకుఁ డాత్మలోన
సారసాకర కాసార సారతీర
భూరి శాఖాతికయ బిల్వమూలమందు
మౌననియతి పద్మాసనాసీనుఁడగుచు. 76

ఉద్ధూళన త్రిపుండ్రము
లిద్ధ గతిన్ దాల్చి యతఁడు నీశ్వర సేవా
బద్ధాత్ముఁ డగుచు నెంతయు
సిద్ధాసనమందు నిల్చి శివుఁ జింతించెన్.77

కరతలంబుననున్న కలితేష్టలింగంబు,
           దశవిధాలోకన దశను జూచి
చూపువెంబడి లింగరూపంబులోఁ జేర్చి,
          లోసాక్షియగు తెల్విలో నమర్చి
ప్రాణలింగమునందుఁ బ్రామాణ్యగతిఁ గూర్చి,
          భావలింగైక్యత పదిలపరచి
యందులోఁ దానైక్యమంది చిదాకాశ
          మూర్తియై యానందభూతిఁ గాంచి