పుట:శ్రీమత్త్రికూటాచల మాహాత్మ్యము.pdf/134

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

101సుఖానుకూలంబుగాఁగడుపుచుండి యొక వేళ జంగమార్చనంబును నొక
వేళ శివపూజయు, నొక వేళ శివమంత్రజపంబును నొక వేళ శివధ్యాన సమాధి
నిష్ఠయు నొకవేళ కోటీశ్వర లింగార్చనంబునుం గావింపుచుఁ బరమానంద
కందళిత స్వాంతుండై యొక్క నాఁడు –68

తన యిలు వెలువడి యొక్కఁడె
మునిసేవితుఁ గోటిలింగమును బూజింపన్
జనుచుండి నడుమఁ గాంచెను
వనమొక్కటి పత్రపుష్పఫలపూర్ణంబున్.69

ఆ వనరాజమందు భువనాపను శంకరుఁ బూజసేయఁగాఁ
భావన వృక్షశాఖల శుభప్రసవావళిఁ గోయుచున్న యా
ధీవనజాతగర్భులగు దిన్యమునీంద్రులఁ జూచి వారి స
త్పావన పద్యుగంబునకు భక్తిరతిన్ నఁతిజేసి ముందటన్,70

పోవ పోవఁగ నంత నపూర్వమహిమ
గలుగు సహకార వనరాజి గానుపించె
మదన సహకార మిది మధుమాసమునను
చోద్యమగు దీని మహిమంబుఁ జూతమనుచు.71

చని చని ముందట.72

అంత గమలాకరంబులై యలరునట్టి
చారు కమలాకరంబులు సరణి నరిగి
బిల్వ కాంతారమొక్కటి ప్రేమఁగాంచి
తద్ద్విలాసంబు వీక్షించి తనివిసనక.73


లయగ్రాహి ;

అందుగల చిత్రముల యందముల జూచి తరుబృందముల నీడలను పొందుగ మనోజ్ఞా ! నందరసమగ్నులయి యిందుధర పూజన మమందముగఁ జేయు